ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ప్రత్యేక గుర్తింపు - మంత్రి రజనికి అరుదైన అవకాశం..!!
ఏపీ ప్రభుత్వానికి మరోసారి కేంద్ర ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఏపీ వైద్య శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర వైద్యశాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. కొద్ది నెలల క్రితమే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి రజనీకి ఈ అవార్దులు అందుకొనే అవకాశం దక్కింది. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రజనీ..ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబు ఈ అవార్డులు స్వీకరించారు. ఇదే సమయంలో జరిగిన సెమినార్ లో ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలను మంత్రి రజనీ జాతీయ ప్రముఖులకు వివరించారు.
ఏపీ వైద్య శాఖకు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. ఏపీలోని ప్రభుత్వ వైద్య రంగంలో టెలీకన్సల్టేషన్..విలేజ్ క్లినిక్స్ అమలుకు కేంద్రం ఈ అవార్డులు ప్రధానం చేసింది. కేంద్రం మూడు అంశాల్లో అవార్డులు ప్రకటించింది. అందులో రెండు అవార్డులు ఏపీకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో నిర్వహిస్తున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే వేడుకల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజనీ..ఎంటీ క్రిష్ణబాబుకు ఈ అవార్డులు అందచేసారు.రాష్ట్ర ప్రభుత్వం 10,032 విలేజ్ క్లినిక్ లను నెలకొల్పుతోంది. 2.84 కోట్ల మందికి టెలి మెడికల్ సేవలు అందించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

ఇదే సమయంలో జరిగిన సెమినార్ లో ఏపీ మంత్రి రజనీ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నుంచి పేదలకు అందిస్తున్న వైద్య సేవలు..అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను వివరించారు. ప్రతీ అయిదు వేల మందికి ఒక సబ్ సెంటర్ అందుబాటులో ఉండాలనే విధానాన్ని కేంద్రం అమలు చేస్తుంటే..ఏపీ ప్రభుత్వం ప్రతీ రెండు వేల మందికి ఒక హెల్త్ క్లినిక్ ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైఎస్సార్ విలేజ్ క్లీనిక్స్ ద్వారా 14 రకాల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ కు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications