మంత్రి కామినేని ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలు(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలో విమ్స్ ఆస్పత్రి సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం విమ్స్ ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. భవనం నిర్మించి సుమారు ఐదేళ్లపాటు వృథాగా వదిలేయడం బాధగా ఉందని తెలిపిన ఆయన, అందుకే మొదటి కేబినెట్ సమావేశంలో రూ. 60 కోట్లు విమ్స్ కోసం మంజూరు చేసినట్లు తెలిపారు.
250 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం ఆయన కెజిహెచ్‌ను సందర్శించారు. ఆస్పత్రిలోనికి ప్రవేశిస్తుండగా ప్రధాన ద్వారా వద్ద ధర్నా చేస్తున్న ట్రామాకేర్ సిబ్బంది మంత్రికారును అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత మంత్రి కార్డియాలజీ ఐసియూను సందర్శించి సేవలను తెలుసుకున్నారు.
ప్రసూతి వైద్య విభాగంలో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల బంధువుల నుంచి కెజిహెచ్ శవాగారం సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని, ఇలాంటి విధానానికి స్వస్తి పలకాలని కామినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. శ్రీనివాసరావు వెంట మరో మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నారు.
అనంతరం వైద్యశాఖ మంత్రి శ్రీనివాస్ హనుమంతువాక వద్దనున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని సందర్శించారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఆప్తమాలజీ, ఇంటర్నేషనల్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆస్పత్రిని ఆనుకుని మరో పది ఎకరాలు కేటాయించాలని ఆస్పత్రి వర్గాలు మంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సింబయోసిస్ సిఈఓఓ నరేష్ కుమార్ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

మంత్రి కామినేని
వైద్యశాఖ మంత్రి శ్రీనివాస్ హనుమంతువాక వద్దనున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని సందర్శించారు.

కామినేని
ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హోటల్ ఫోర్‌పాయింట్స్‌లో నిర్వహించిన అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కామినేని
మంత్రి కామినేని శ్రీనివాసరావు మానసిక ఆస్పత్రి ప్రాంగణంలోని కోల్డ్ డ్రగ్ స్టోరేజీని పరిశీలించారు.

కామినేని
మృతుల బంధువుల నుంచి కెజిహెచ్ శవాగారం సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని, ఇలాంటి విధానానికి స్వస్తి పలకాలని కామినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.

కామినేని
వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. శ్రీనివాసరావు వెంట మరో మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నారు.

కామినేని
నగరంలో విమ్స్ ఆస్పత్రి సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం విమ్స్ ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు.

కామినేని
ప్రసూతి వైద్య విభాగంలో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామినేని
ఆ తర్వాత పెదవాల్తేరులోని మానసిక ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీ క్లాస్ రూములు, ఇతర వార్డులను పరిశీలించారు.

కామినేని
నగరంలో విమ్స్ ఆస్పత్రి సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం విమ్స్ ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు.

కామినేని
భవనం నిర్మించి సుమారు ఐదేళ్లపాటు వృథాగా వదిలేయడం బాధగా ఉందని తెలిపిన ఆయన, అందుకే మొదటి కేబినెట్ సమావేశంలో రూ. 60 కోట్లు విమ్స్ కోసం మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హోటల్ ఫోర్‌పాయింట్స్‌లో నిర్వహించిన అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని దానాల్లో అవయవదానం మహోత్తమమైనదని, అవయవదానంపై అవగాహనకు ఆగస్టు 6న బీచ్ రోడ్‌లో వాక్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఆ తర్వాత పెదవాల్తేరులోని మానసిక ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీ క్లాస్ రూములు, ఇతర వార్డులను పరిశీలించారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు లేవని, ఆరోగ్యశ్రీ కూడా లేదని వైద్యులు మంత్రికి తెలిపారు. రోగుల మందులకు ఇప్పటికి సుమారు రూ. 40 లక్షల వరకు ప్రైవేటు మందుల యాజమాన్యాలకు బకాయి పడ్డామని చెప్పారు. మంత్రి ఆస్పత్రి ప్రాంగణంలోని కోల్డ్ డ్రగ్ స్టోరేజీని పరిశీలించారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications