అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ సర్కార్‌కు భారీ ఊరట- రేపే పరిషత్‌ ఎన్నికలు- కౌంటింగ్ మాత్రం వాయిదా

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎంటీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఉత్కంఠ వీడిపోయింది. పరిషత్‌ పోరుకు ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని టీడీపీ వేసిన పిటిషన్‌పై సింగిల్‌ బెంచ్‌ విచారణ జరిపి ఎన్నికలకు బ్రేక్‌ వేసింది. అయితే దీనిపై ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు... రేపు ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో ఫలితాల వెల్లడిని మాత్రం వాయిదా వేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Recommended Video

#Breaking #apelections ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు..!
 పరిషత్‌ పోరుపై హైకోర్టు కీలక తీర్పు

పరిషత్‌ పోరుపై హైకోర్టు కీలక తీర్పు

ఏపీలో ఎంటీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టీడీపీ వేసిన పిటిషన్‌పై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇవాళ కొట్టేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కారణంగా చూపుతూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ తప్పుబట్టింది. ఇవాళ ప్రభుత్వం, ఎస్‌ఈసీతో పాటు పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. దీంతో రేపు జరగాల్సిన పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి.

 ఎన్నికలకు ఓకే- ఫలితాలు మాత్రం వాయిదా

ఎన్నికలకు ఓకే- ఫలితాలు మాత్రం వాయిదా

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రేపు నిర్వహిచుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. ఫలితాల వెల్లడిపై మాత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం రేపు పోలింగ్‌, ఈ నెల 10న కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయితే తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం తిరుపతి ఉపఎన్నికపై పడకుండా ఉండేందుకు ఫలితాల వెల్లడిని మాత్రం వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 జగన్‌ సర్కార్‌కు భారీ ఊరట

జగన్‌ సర్కార్‌కు భారీ ఊరట

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావించిన ప్రభుత్వం ఎస్ఈసీ నీలం సాహ్నీ సాయంతో ఈ నెల 8న ఎన్నికలకు సిద్ధపడింది. త్వరగా ఎన్నికలు ముగిసిపోతే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని గతంలోనే కోరింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు సానుకూలంగా ఉండటంతో ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కింది. దీంతో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి భారీ ఊరట కానుంది.

English summary
andhra pradesh high court has dismissed the single bench orders on mptc and zptc elections in the state and orders to continue the polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X