Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి రైతులకు భారీ ఊరట - పాదయాత్రకు హైకోర్టు అనుమతి : కండీషన్స్ అప్లై..!!

అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి' పేరుతో అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు అమరావతి జేఏసీకి స్పష్టం చేసారు. 47 రోజుల పాటు సాగే యాత్ర ద్వారా పార్టీలపరంగా చీలిపోయిన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు అక్కడి పరిణామాలు ఘర్షణలకు దారితీయొచ్చని, అప్పుడు శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఆ లేఖలో తెలిపారు.

పోలీసుల అనుమతి నిరాకరణ

పోలీసుల అనుమతి నిరాకరణ

ఇది మూడు రాజధానుల అమలు కోరుకునే ప్రాంత ప్రజల్లో శతృత్వానికి కారణమవుతుందని వివరించారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. ఈ పాదయాత్రలో ఎంతమంది, ఎవరెవరు పాల్గొంటారనే దానిపై స్పష్టత లేదు. ఒకేచోట భారీసంఖ్యలో జనం గుమిగూడటం వల్ల నిర్వాహకులు కొవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించటం కష్టం. ఇది కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతుందని అమరావతి జేఏసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

హైకోర్టులో వాదనలు

హైకోర్టులో వాదనలు

దీంతో..జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం టూ దేవస్థానం రాజధాని రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజధాని రైతులు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో అమరావతి జేఏసీ తరపున వాదించిన న్యాయవాది ఇవి లక్ష్మీనారాయణ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించారు.

పాదయాత్రకు షరతులతో అనుమతి

పాదయాత్రకు షరతులతో అనుమతి

పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేసారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పుకొచ్చారు. అయితే, రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు నివేదించారు. దీంతో.. హైకోర్టు పాదయాత్రకు షరతులతో అనుమతి ఇచ్చింది. నవంబర్ 1 నుంచి ప్రారంభమై..డిసెంబర్ 17 వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

జగన్ మూడు రాజధానుల ప్రకటన నాటికి

జగన్ మూడు రాజధానుల ప్రకటన నాటికి

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన డిసెంబర్ 17న యాత్ర ముగించాలని అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ఇప్పుడు హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వటంతో మరో రెండు రోజుల్లో వారి యాత్రం ప్రారంభం కానుంది. ఇప్పుడు ప్రభుత్వం దీని పైన ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+