Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ సీఐడీ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు బిగ్ రిలీఫ్..!!

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు పై సీఐడీ నమోదు చేసిన మూడు కేసుల్లో ఒకే సారి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కండీషన్లను స్పష్టం చేసింది. చంద్రబాబు తో పాటుగా లిక్కర్ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సీఐడీ ఈ కేసుల్లో చంద్రబాబును విచారించాలని భావిస్తే అందుకు కొన్ని నిబంధనలను కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

హైకోర్టులో ముందస్తు బెయిల్ : ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేస్తున్నారు. జనసేనతో కలిసి పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఈ సమయంలోనే హైకోర్టులో చంద్రబాబుకు బారీ ఊరట దక్కింది. చంద్రబాబు పైన ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చారు. ఈ సమయంలోనే చంద్రబాబు పైన సీఐడీ మరో మూడు కేసులు నమోదు చేసింది.

AP High Court Grants Anticipatory bail for TDP Chief Chandra Babu in Three CID Cases

మూడు కేసుల్లో ఒకేసారి : ఈ కేసుల్లో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేసారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఏ1గా చంద్రబాబును సీఐడీ పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటుగా మద్యం కంపెనీలను నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేసారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ3గా నమోదు చేసింది. మరో కేసులో ఇసుక పాలసీ వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రబుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీబీఐ కేసు నమోదు చేసింది. వీటి పైన హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పైన ఈ రోజు కోర్టు తీర్పు వెలువరించింది.

AP High Court Grants Anticipatory bail for TDP Chief Chandra Babu in Three CID Cases

కోర్టు మార్గదర్శకాలు : ఒకే సారి మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఈ కేసుల్లో సీఐడీ మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ఠ కాలపరిమితితో నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు విషయంలోనూ కోర్టు కొన్ని కండీషన్లు విధించినట్లు తెలుస్తోంది. ఇక...స్కిల్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం రిజర్వ్ చేసింది. వచ్చే వారం సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెలువరించే అవకాశం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు అంచనా వేస్తున్నారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+