క్యాంపెయిన్ గా జడ్జిలను ట్రోల్ చేసారు - బుద్దాతో సహా 26 మందికి నోటీసులు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత జడ్జిలపై ట్రోల్స్ వ్యవహారంపై కేసు నమోదైంది. చంద్రబాబు కేసులను విచారించిన న్యాయమూర్తులపై ఉద్దేశ పూర్వకంగా (Trolling)చేయటం పైన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఈ మేరకు దాఖలైన కోర్టు కంటెప్ట్ పిటీషన్(Contempt Petition) విచారణ చేసిన హైకోర్టు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న..గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జడ్జిలపై ట్రోలింగ్
క్రిమినల్ కంటెప్ట్ పిటీషన్ వాదనల సమయంలో క్యాంపెయిన్ గా జడ్జి పై ట్రోలింగ్ చేసారని ఏజీ శ్రీరామ్(AG Sriram) పేర్కొన్నారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్ గా ట్రోలింగ్ నడిచిందని కోర్టుకు వివరించారు. సోషల్ మీడియా(Social Media)లో అభ్యంతరకర పోస్టులు పెట్టారని హై కోర్టుకు ఏజీ ఫిర్యాదు చేశారు. ఐడీలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.టీడీపీ(TDP) నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్న, మాజీ న్యాయమూర్తి రామకృష్ణ సహా మొత్తం 26 మంది పేర్లను అడ్వకేట్ జనరల్ (AG)పేర్కొన్నారు. గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్‌లను కూడా పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది. కోర్టు ధిక్కరణ(Court Contempt) కింద పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

హైకోర్టులో వాదనలు
దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. వీరందరి ఐడీలను గుర్తించి నోటీసులు పంపాలని డీజీపీ(DGP)కి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ నాలుగు వారాలకు పిటీషన్ విచారణ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు(Chandra Babu Arrest) అరెస్ట్ తరువాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా కొందరు దూషణలకు దిగారు. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు పోస్టింగ్స్ చేసారు. ఈ వ్యవహారంలో మొత్తం 26 మందిని ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది. స్కిల్ కేసు(Skill Case)లో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చింది. కోర్టులో విచారణ తరువాత చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత హైకోర్టు(High Court)లో చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
26 మందికి నోటీసులు
అయితే, ఈ తీర్పులను ఇచ్చిన న్యాయమూర్తులను సోషల్ మీడియా వేదికగా తూలనాడుతూ పోస్టులు చేయటాన్ని ప్రభుత్వం(AP Govt) సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్(Rashtrapathi Bhavan) కు ఫిర్యాదులు అందయాయి. అటువంటి పోస్టులు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)కి రాష్ట్రపతి కార్యదర్శి లేఖ రాసారు. తాజాగా హైకోర్టు(High Court) కోర్టు ధిక్కరణ పిటీషన్ ప్రభుత్వం దాఖలు చేసిది. వీరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏజీ అభ్యర్దించారు. దీని పైన స్పందించిన న్యాయస్థానం ఈ 26 మందికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications