అమరావతిలో ట్విస్ట్-చంద్రబాబు, నారాయణ కేసు నుంచి హైకోర్టు జడ్డి అవుట్ ! రీజన్ ఇదే..
అమరావతి : ఏపీలో టీడీపీ హయాంలో మొదలైన అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో చోటు చేసుకున్నాయని చెబుతున్న అక్రమాల విషయంలో వైసీపీ సర్కార్ వరుస దర్యాప్తులు చేయిస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలో అసైన్డ్ భూముల కేసును సీఐడీ నమోదుచేసింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసు తాజా విచారణ సందర్భంగా హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అమరావతిలో మరో ట్విస్ట్
ఏపీ రాజధాని అమరావతిలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజధాని నిర్మాణం కోసం గతంలో సేకరించిన అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈ ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసులు నమోదు చేసింది. వీటిపై హైకోర్టులో వారు పోరాడుతున్నారు. ఎస్సీలైన పేద రైతులకు గతంలో ప్రభుత్వాలు కేటాయించిన అసైన్డ్ భూముల్ని రాజధాని పేరుతో కారు చౌకగా టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించారనేది వీరిపై అభియోగం. ఈ కేసులో హైకోర్టులో విచారణ జరుపుతున్న సందర్భంలో ఈ ట్విస్ట్ చోటు చేసుకుంది.

విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
హైకోర్టులో అమరావతి అసైన్డ్ భూముల కేసును విచారిస్తున్న ధర్మాసనం నుంచి జడ్డి జస్టిస్ శ్రీనివాసరెడ్డి అకస్మాత్తుగా తప్పుకున్నారు. నిన్న ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో శ్రీనివాసరెడ్డి తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, దీని వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. అసలే హైప్రొఫైల్ కేసు కావడం, జడ్డి చివరి నిమిషంలో విచారణ నుంచి తప్పుకోవడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. అయితే విచారణ నుంచి తప్పుకున్న సదరు జడ్జి శ్రీనివాసరెడ్డి దానికి గల కారణాల్ని వెల్లడించారు.

అసలు కారణమిదే ?
అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ నుంచి జడ్జి శ్రీనివాసరెడ్డి తప్పుకోవడం వెనుక ఓ కీలక కారణం ఉంది. అది
ఏపీలో గత శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా పనిచేశారు. అలాగే దర్యాప్తు అధికారులు తనను సంప్రదించారని కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారాయణ దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ జరిపి తాను తీర్పు ఇవ్వడం సరికాదని భావించినట్లు జస్టిస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీంతో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్ధానంలో మరో జడ్జి ఈ కేసును విచారించబోతున్నారు.