జీవో నెంబర్ 1 - హైకోర్టు కీలక నిర్ణయం..!!
జీవో నెంబర్ 1 పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో 8 మంది మరణించారు. దీంతో.. బహిరంగ సభలు.. రోడ్ షోల నిర్వహణ పైన ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా రోడ్ల పైన వీటి నిర్వహణకు అనుమతి నిరాకరించింది. ఈ జీవో పైన రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.
ఈ జీవో జారీ పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం తొలుత ఈ రోజు వరకు జీవో అమలు పైన సస్పెన్షన్ విధించింది. దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసింది. కాగా, సుప్రీం సూచనల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును విచారించారు. జీవో పైన విచారణ రేపటికి ( మంగళవారం) వాయిదా వేసింది..

ప్రభుత్వ జీవో..రాజకీయ రగడ
చంద్రబాబు సభల్లో తొక్కిసలాట తరువాత తీసుకొచ్చిన ఈ జీవో ప్రతిపక్షాలను ఉద్దేశించి తీసుకొచ్చారంటూ టీడీపీ - జనసేన వామపక్షాలు ఆరోపించాయి. కుప్పంలో చంద్రబాబు రోడ్ షో కు ఈ జీవో చూపించి పోలీసులు అడ్డుకున్నారు. దీని పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబును కుప్పంలో అడ్డుకోవటం పైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు.
జీవో ఉప సంహరించుకొనే వరకూ పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం ఈ జీవో ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా ఇవ్వలేదని..వైసీపీకి కూడా జీవో వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ జీవో పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్ ను విచారించింది. ఈ జీవోను ఈ రోజు వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు గత వారం ఆదేశాలు ఇచ్చింది.

సీజే కీలక వ్యాఖ్యలు
ఈ ఆదేశాల పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. విచారించిన సుప్రీంకోర్టు కేసు హైకోర్టులో విచారణలో ఉండగా తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును విచారించాలని సూచించింది. ఈ రోజు విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసారు.
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాల్సినంత తొందర ఏముందన్న హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఈ కేసులో ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. గత పది రోజుల్లో పిటిషనర్ ధర్నా చేశారా? అని సీజేఐ ప్రశ్నించారు. వెకేషన్ బెంచ్ సీజే బదులుగా పనిచేస్తోందన్న చీఫ్ జస్టిస్ గుర్తు చేసారు.
ఇలాంటి పిటిషన్లను వెకేషన్ బెంచ్ ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. దీన్ని అనుమతిస్తే, ప్రతీ వెకేషన్ బెంచ్ సీజేగా మారిపోతుందన్న చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. పిటిషనర్‌కు బెనిఫిట్ చేయడానికి కాకపోతే ఏమిటీ తొందర అన్న చీఫ్ జస్టిస్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.

రేపు తుది నిర్ణయం
ఈ రోజు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. రేపు కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు కొనసాగించనున్నారు. పిటీషనర్ తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఈ రోజుతో జీవో పైన ఇచ్చిన సస్పెన్షన్ ముగస్తున్నందున పొడిగించాలని పిటీషనర్లు కోరారు. రేపు ఫైనల్ ఆర్డర్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం జీవో నెంబర్ 1 అమలు పైన హైకోర్టు తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ తీర్పు ఏపీ లో రాజకీయంగా కీలకం కానుందది.












Click it and Unblock the Notifications