అల్లు అర్జున్ పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
సినీ హీరో అల్లు అర్జున్ కు కోర్టులో ఊరట దక్కింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పై దాఖలైన కేసు పై హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘిం చారనేది అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసారు.ఈ కేసు కొట్టేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన హైకోర్టు తాజాగా అల్లు అర్జున్ అభ్యర్ధన మేరకు క్వాష్ చేస్తూ నిర్ణయం వెలువరించింది.
2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి నివాసానికి వెళ్లారు. అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అల్లు అర్జున్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేసారు. అల్లు అర్జున్ సమయంలో వైసీపీ అభ్యర్ధి ఇంటికి వెళ్లటం ఆ తరువాత పొలిటికల్ టర్న్ తీసుకుంది. పవన్ కల్యాణ్ వర్సస్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలో తన పైన కేసు విషయంలో బన్నీ హైకోర్టును ఆశ్రయించారు.

తన పైన నమోదైన ఈ కేసును కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గత నెల 25న విచరాణకు రాగా.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ రోజున కోర్టు ఈ పిటీషన్ పైన తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్ చేసిన అభ్యర్దనను పరిగణలోకి తీసుకుంది. బన్నీ పైన నమోదై కేసును క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో, కోర్టు వెలువరించిన నిర్ణయం ద్వారా అల్లు అర్జున్ కు భారీ రిలీఫ్ దక్కింది.












Click it and Unblock the Notifications