వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా టికెట్ల ధరల తగ్గింపు పిటీషన్‌పై విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల నియంత్రణ, తగ్గింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. టికెట్ల ధరలను నిర్దేశిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన నేపథ్యంలో.. దానిపై అప్పీల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో జగన్ సర్కార్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ ఇది. దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. ఈ ఉదయం విచారణను చేపట్టింది.

అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి చేయడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు సహా గ్రామీణ ప్రాంతాల్లో సినిమా హాళ్ల వరకూ విక్రయించే టికెట్ల ధరలను నిర్ధారిస్తూ జగన్ సర్కార్ ఇదివరకు జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

 AP High Court postponed the hearing on the petition against Cinema tickets price reducing issue to February 10.

ఈ రేట్లతో టికెట్లను విక్రయించుకుంటే- మనుగడ సాగించమంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్ల నిర్వహణకు కూడా డబ్బులు రావంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వ్యతిరేకిస్తూ థియేటర్ల యజమానులు ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వారి తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. జీవో 35లో పొందుపరిచిన సినిమా టికెట్ల రేట్లు హేతుబద్ధంగా లేవంటూ వారు వాదించారు.

టికెట్ల రేట్లను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా సింగిల్ బెంచ్.. పిటీషన్ల తరఫు వాదనలతో ఏకీభవించింది ఈ జీవోను రద్దు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు తీర్పు వెలువడించింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. జీవో రద్దు చేయడాన్ని సవాల్ చేసింది. డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. లంచ్ మోషన్ పిటీషన్‌ను దాఖలు చేసింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

Recommended Video

Covid 19 Vaccination For Teenagers Begins|CoWIN | Omicron | Oneindia Telugu

దీనిపై ఇవ్వాళ డివిజన్ బెంచ్ విచారణను చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆయనను ఆదేశించింది. దీనిపై కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ హైకోర్టును అభ్యర్థించారు. దీనితో హైకోర్టు- గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. అప్పట్లోగా ప్రభుత్వం అఫిడివిట్‌ను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

English summary
AP High Court postponed the hearing on the petition against Cinema tickets price reducing issue to February 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X