వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట-పిల్ లపై కీలక వ్యాఖ్యలు-విపక్షాలకు షాక్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో తీసుకున్న అనేక నిర్ణయాలను విపక్షాలు తాము నేరుగానో, లేక తమ సానుభూతిపరులతోనో కోర్టుల్లో సవాల్ చేయించాయి. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిల్ లతో వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు తప్పలేదు. మరికొన్ని సార్లు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకూ ఇవి ఇబ్బందికరంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. వీటితో ప్రభుత్వ పనితీరుపైనా ప్రభావం పడుతోంది. తాజాగా హైకోర్టు ఈ విషయంపైనే కీలక వ్యాఖ్యలు చేసింది. అవి ప్రభుత్వ పనితీరును పిల్ లతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలకు షాక్ గా మారింది.

 ప్రజా ప్రయోజన వాజ్యాలు

ప్రజా ప్రయోజన వాజ్యాలు

ఏపీలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు కావడం సర్వసాధారణమే అయినా గత రెండేళ్లలో రాష్ట్రంలో దాఖలైనన్ని పిల్ లు ఎక్కడా దాఖలై ఉండవు. ప్రజా ప్రయోజనం పేరుతో ప్రభుత్వాలు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేస్తూ అడ్డుపడటం విపక్షాలకు ఫ్యాషన్ అయిపోయిందన్న విమర్శలు వైసీపీ సర్కార్ నుంచి నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజా ప్రయోజన వాజ్యాల దాఖలుపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాజ్యం విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

 హైకోర్టులో తాజా ప్రజా ప్రయోజన వాజ్యం

హైకోర్టులో తాజా ప్రజా ప్రయోజన వాజ్యం

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రాంతీయ వ్వవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను వైద్య కళాశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయవిద్యాలయం చేసిన తీర్మానం ప్రకారం ఈ స్ధలం వైద్య కళాశాలకు ఇవ్వాల్సి ఉంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సమగ్ర వివరణ ఇవ్లాసని కోరింది.

 పిల్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పిల్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య కళాశాలలు లేకపోతే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ ప్రజా ప్రయోజనం పేరుతో సవాల్ చేయడానికి వీల్లేదని పేర్కొంది. ప్రభుత్వం వైద్యకళాశాల నిర్మాణం సందర్భంగా వ్యవసాయ పరిశోదన కేంద్రం స్ధలాన్ని తీసుకుంటున్నందున ప్రత్యామ్నాయంగా స్ధలం కేటాయిస్తుంది కదా అని తెలిపింది. ఈ వాజ్యంపై విచారణను నవంబర్ 18వ తదీకి వాయిదా వేసింది.

Recommended Video

RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Oneindia Telugu
 విపక్షాలకు షాక్

విపక్షాలకు షాక్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం దీసుకుంటున్న పలు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హైకోర్టుతో పాటు పలు కోర్టుల్లో ప్రజా ప్రయోజన వాజ్యాలు వేస్తున్న విపక్షాలకు హైకోర్టు వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిల్ లు దాఖలు చేయడం అలవాటుగా మార్చుకున్న విపక్షాలకు హైకోర్టు వ్యాఖ్యలతో గట్టి ఎధురుదెబ్బ తగిలినట్లయింెది. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలనే లక్ష్యం మినహా ఎలాంటి ప్రజా ప్రయోజనం లేని వాజ్యాలతో కోర్టు సమయం వృథా అయ్యే వ్యవహారానికి దీంతో తెరపడనుంది.

English summary
in big relief to andhrapradesh government, high court says one can't challenge every decision by government through public interest litigation petitions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X