వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27 మంది ఖైదీల‌కు ఎయిడ్స్‌: జైల్లోకి వచ్చాక ఎయిడ్స్‌ బారిన పడ్డారా..లేక‌: ఏపీ హైకోర్టు విస్మ‌యం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ హైకోర్టు విస్మ‌యం వ్య‌క్తం చేసే ఘ‌ట‌న చోటు చేసుకుంది. జైళ్లో శిక్ష అనుభ‌విస్తున్న ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు ఏకంగా 27 మంది ఖైదీల‌కు ఎయిడ్స్ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఇదే విష‌యాన్ని ఒక కేసుల విష‌యంలో హై కోర్టుకు నివేదించారు. దీంతో..న్యాయ‌మూర్తి విస్మ‌యానికి గుర‌య్యారు. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్‌ ఉందా .. జైల్లోకి వచ్చాక ఎయిడ్స్‌ బారిన పడ్డారా.. అనే విషయాలపై పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వీరందరికీ అన్ని వైద్య పరీక్షలు చేయించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఏమి టో కూడా తమకు తెలియచేయాలని ఆదేశించింది.

27 మంది ఖైదీల‌కు ఏయిడ్స్‌..

27 మంది ఖైదీల‌కు ఏయిడ్స్‌..

అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి..ఆలోచ‌న‌కు కార‌ణ‌మ‌య్యే ఒక ఘ‌ట‌న హైకోర్టులో వెలుగులోకి వ‌చ్చింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు కోర్టు దృష్టికి వ‌చ్చింది. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 2018లో జీవిత ఖైదును విధించింది. దీన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి 2019లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. తాను ఎయిడ్స్‌తో బాధపడుతున్నానని, అందువల్ల తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు. ఇందులో భాగంగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ.. రాజమండ్రి జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. అసలు జైల్లో ఎంత మంది ఖైదీలు ఉంటారని ధర్మాసనం ఆరా తీసింది. 1500 మంది వరకు ఉండొచ్చునని పీపీ చెప్పగా, ఇంతమం ది ఎయిడ్స్‌తో బాధపడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. జైల్లోకి వచ్చే ముందు ఖైదీలకు తప్పనిసరిగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

జైళ్లోకి రాక‌ముందా..వ‌చ్చాక ఏయిడ్స్ వ‌చ్చిందా..

జైళ్లోకి రాక‌ముందా..వ‌చ్చాక ఏయిడ్స్ వ‌చ్చిందా..

ఈ కేసులో హైకోర్టు ఒక ఆస‌క్తి క‌ర ప్ర‌శ్న‌ను సంధించింది. అస‌లు జైళ్లో ఉన్న ఏకంగా 27 మంది ఖైదీల‌కు ఎయిడ్స్ ఉండ‌టం పైన ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఇదే స‌మ‌యంలో జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్‌ ఉందా? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్‌ బారిన పడ్డారా అని ప్ర‌శ్నించింది. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, దీన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 2కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తి వివరా లతో తమ ముందు హాజరు కావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవ‌ద్దు..

ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవ‌ద్దు..

ఇదే స‌మ‌యంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్య‌లు..సూచ‌న‌లు చేసింది. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, దీన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామికి స్పష్టం చేసింది. ఆ ఖైదీలను మిగిలిన వారి నుంచి వేరు చేస్తామని చెప్పగా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది నేరమని, వారి పట్ల అది వివక్ష చూపడమే అవుతుందని వ్యాఖ్యానించింది. అసలు వారికి వ్యాధి ఎలా సోకిందని ప్రశ్నించింది. జైల్లోకి వచ్చాక వీరు ఎయిడ్స్‌ బారిన పడ్డారని తెలిస్తే జైలు సూపరింటెండెం ట్ పై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్య‌ల‌తో జైలు అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నా రు. వీరికి జైళ్లోకి వ‌చ్చాక ఏయిడ్స్ వ‌చ్చిందా..రాక‌ముందే ఉందా అనే దానిని ఎలా తేల్చాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టు కుంటున్నారు. జైళ్లోకి వ‌చ్చినాక ఏయిడ్స్ వ‌స్తే దీనికి సంబంధింని స‌మాధానం చెప్పుకోవ‌టం ఇబ్బంది క‌రంగా మారే అవ‌కాశం ఉంది.

English summary
AP High court seeks report on aids prisoners of Rajahmundry central Jail. As per Govt lawyer report 27 prisoners with Aids in central Jail. High court ordered for total report on these prisoners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X