అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించకపోతే ఎలా ?.. ఎవ‌రు ముందుకొస్తారు ? .. జ‌గ‌న్ స‌ర్కార్‌కు హైకోర్టు చివాట్లు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కాంట్రాక్టర్ల తిప్పలు అన్ని ఇన్నికావు. చేసిన పనులకు బిల్లులు రాకా నానా అవస్థులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయామని వాపోతున్నారు. అటు పనులకు ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడంలేదు.. ముందు చేసిన పనులకే బిల్లులు చెల్లించలేదు.. కొత్తవాటిని చేపట్టి మళ్లీ చేతులు కాల్చుకోలేమంటూ ప్రభుత్వ అధికారులకు తెగేసి చెబుతున్నారు.

హైకోర్టుకు కాంట్రాక్టర్లు

హైకోర్టుకు కాంట్రాక్టర్లు

ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఏకమైయ్యారు. ప్రభుత్వం పనులు చేయరాదని నిర్ణయించారు. దీనికి ఇది ప్రత్యేక నిదర్శనంగా .. ఇటీవల జగన్ ప్రభుత్వం టెంటర్లకు పిలస్తే ఏ ఒక్క కాంట్రాక్టరు ముందుకు రాలేదు. గతంలో చేసిన పనులకే డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన కొంతమంది కాంట్రాక్లర్లు హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని ఫిటిషన్ దాఖలు చేశారు. తాము చేసిన బిల్లులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయకపోతే తమకు ఆత్మహత్యే గతి అని ఆవేదన వక్తం చేశారు. అప్పుల పాలైయ్యామని విన్నమించారు.

ఇలా అయితే ఎవరు ముందుకు వస్తారు

ఇలా అయితే ఎవరు ముందుకు వస్తారు

ప్రభుత్వ కాంట్రాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. కోర్టుకు రాష్ట్రప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ న్యాయస్థానం ముందు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఇలాగే వ్యవహరిస్తే పనులు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారని కడిగిపారేసింది.

ప్రాధాన్యతా క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు

ప్రాధాన్యతా క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు

గతం ప్రభుత్వంలో చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. అప్పులు పాలై వాళ్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని న్యాయస్థానానికి వివరించారు. దీంతో బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం ఎందుకు ఆలసత్వం వహిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది.

దీనికి సీఎస్ సమీర్ శర్మ సమాధానమిస్తూ ప్రాధాన్యతా క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపింది. దీంతో న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించింది. బిల్లుల చెల్లింపును 9వ ప్రాధాన్యతగా ఎందుకు పెడుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఇలాగైతే ప్రభుత్వ పనులకు ఎవరు ముందుకువస్తారని పేర్కొన్నారు. బిల్లులు సకారంలో చెల్లించేలా ఆయా శాఖ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

English summary
AP High Court key remarks on government contract works pending bills by cm jagan government..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X