వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటం కూల్చివేతలు - వాస్తవాలు చెప్పకుండా : హైకోర్టు ఆగ్రహం..!!

|
Google Oneindia TeluguNews

ఇప్పటం గ్రామంలో కూల్చివేత వ్యవహారంపై హైకోర్టులో కీల వ్యాఖ్యలు చేసింది. ఏపీలో ఇప్పటంలో కూల్చివేతలు రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఆక్రమణల ను స్థానిక అధికారులు తొలిగించారు. తమ పార్టీ సభకు భూములు ఇచ్చారనే కారణంతోనే ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చివేస్తుందంటూ జనసేన అధినేత ఆరోపించారు. పవన్ కల్యాణ్ గ్రామంలో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇప్పటంలో పవన్ పర్యటన
ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష చొప్పున పార్టీ నుంచి ఆర్దిక సాయం అందించాలని పవన్ నిర్ణయించారు. ఇందు కోసం ఈనెల 27న ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటించి..వారికి ఆర్దిక సాయం అందించనున్నారు. ఇక, ఇదే సమయంలో ఇప్పటం వ్యవహారం పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ల విచారణ సమయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చినా తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

AP High court Serious comments on Ippatam Demolitions petitioner

నోటిసుల విషయం దాచిపెట్టారంటూ
వాస్తవాలు తొక్కిపెట్టి స్టే ఉత్తర్వులు పొందినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చారని కోర్టు ముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవాలు తొక్కిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది.

కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే
ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని గతంలో ప్రభుత్వంలోని అధికారులు సైతం చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెలలోనే నోటీసులు ఇచ్చిన విషయాన్ని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఎవరి ఇళ్లు కూల్చివేయలేదని.. కేవలం నోటీసులు ఇచ్చిన వారి ప్రహరీలు మాత్రమే కూల్చారని మంత్రులు ఫొటోలతో వివరించారు. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైసీపీ - జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
AP High Court Serious comments against IPpatam petitioners in notices issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X