నిమ్మగడ్డకు హైకోర్టు షాక్- రేషన్ వాహనాల వాడకంపై- జగన్ సర్కార్‌కు ఊరట
ఏపీలో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాల వాడకానికి పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా గతంలో బ్రేక్ పడింది. అయితే ఎన్నికల కారణంగా రేషన్ పంపిణీకి వాహనాలు వాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. రేషన్ వాహనాల వాడకంపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది.
ఏపీలో నెలవారీ రేషన్ పంపిణీ కోసం ప్రభుత్వం రూ.500 కోట్లకు పైగా ఖర్చుపెట్టి కొత్త వాహనాలు కొనుగోలు చేసింది. వీటికి వైసీపీ రంగులు కూడా వేశారు. అలాగే సీఎం జగన్ ఫొటోను కూడా ముద్రించారు. గత నెలలో సీఎం జగన్ వీటికి విజయవాడలో ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామాల్లో వీటిని వినియోగించకుండా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ నిషేధించారు. నాలుగు వారాల పాటు వీటిని గ్రామాల్లో తిప్పడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు.

ఎస్ఈసీ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎస్ఈసీ పరిశీలన తర్వాత వీటిని వాడుకోవచ్చని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ వాహనాలను స్వయంగా పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సీఎం జగన్ ఫొటో ఉందన్న కారణంతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. రేషన్ వాహనాలను అడ్డుకోవడం సరికాదని తేల్చిచెప్పింది. ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేసే వీటిపై నిషేధాన్ని తప్పుబట్టింది. దీనిపై గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications