Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ఏడాదీ తరలింపు లేనట్లే-మే 3 నుంచి హైకోర్టు విచారణ- తీర్పు తర్వాతే విశాఖకు

ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో ఛీఫ్‌ జస్టిస్ మార్పు తర్వాత హైకోర్టులో పెండింగ్‌లో పడిన విచారణ ఇవాళ మొదలైంది. అయితే హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణను మే 3 నుంచి రోజువారీ విచారిస్తామని తెలిపింది. దీంతో ఈ ఏడాది రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్లయింది. హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం కూడా రాజధాని తరలింపును వచ్చే ఏడాదికి వాయిదా వేసుకునేందుకు సిద్ధమవుతోంది.

 రాజధాని పిటిషన్లపై మళ్లీ హైకోర్టు విచారణ

రాజధాని పిటిషన్లపై మళ్లీ హైకోర్టు విచారణ

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినా, ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గతేడాది కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా మరికొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నీకలిపి హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. అయితే విచారణ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ఛీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణ నిలిచిపోయింది. జనవరిలో నిలిచిపోయిన ఈ విచారణను హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ అరూప్‌ గోస్వామి ఇవాళ తిరిగి ప్రారంభించారు.

 మే 3 నుంచి రోజువారీ విచారణకు నిర్ణయం

మే 3 నుంచి రోజువారీ విచారణకు నిర్ణయం

మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన దాదాపు వంద పిటిషన్లపై విచారణ ఇవాళ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం, డిఫెన్స్‌ తరపున డీఎస్‌ఎన్వీ ప్రసాద్‌ బాబు వాదనలు వినిపించారు. అయితే ఇద్దరూ కీలకమైన ఈ పిటిషన్లపై ఆన్‌లైన్ విచారణకు బదులుగా నేరుగా విచారణ నిర్వహించాలని ధర్మాసనాన్ని కోరారు. రాజధాని పిటిషన్లపై విచారణ త్వరగా ముగించాలని అడ్వకేట్‌ జనరల్ శ్రీరాం హైకోర్టును కోరారు. దీంతో వీటిని అధ్యయనం చేసేందుకు వీలుగా హైకోర్టు ధర్మాసనం మే 3 వరకూ దీన్ని వాయిదా వేసింది. మే 3 నుంచి ఈ పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభిస్తామని తెలిపింది.

 ఈ ఏడాదీ రాజధాని తరలింపుకు బ్రేక్‌

ఈ ఏడాదీ రాజధాని తరలింపుకు బ్రేక్‌

రాజధాని బిల్లులపై దాఖలైన పిటిషన్ల విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేయడం, అప్పటి నుంచి రోజువారీ విచారణ చేస్తామని ప్రకటించడంతో ఈ ఏడాది రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. హైకోర్టు విచారణ మే 3న తిరిగి ప్రారంభం కానుండగా.. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్ధితి. కాబట్టి ఆ లోపు ప్రభుత్వం రాజధానిని తరలించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే హైకోర్టు హెచ్‌ఓడీ కార్యాలయాల తరలింపుపై నిషేధం విధించింది. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు విషయంలోనూ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో రాజధాని తరలింపు ఈ ఏడాది వాయిదా పడినట్లే.

 హైకోర్టు తీర్పు తర్వాతేనంటున్న జగన్

హైకోర్టు తీర్పు తర్వాతేనంటున్న జగన్

ప్రస్తుత పరిస్ధితుల్లో రాజధాని తరలింపుకు ప్రభుత్వం కూడా అంత సుముకంగా లేనట్లు కనిపిస్తోంది. ఓవైపు విద్యా సంవత్సరం పూర్తి కాకపోవడం, మరోవైపు అర్ధాంతరంగా ఉద్యోగులను తరలించే అవకాశం లేకపోవడం, ఇంకోవైపు విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణం, అటు కరోనా వ్యాక్సినేషన్‌ కూడా ప్రారంభించాల్సిన పరిస్ధితులు ఉండటంతో ప్రభుత్వం వచ్చే ఏడాదికి తరలింపును వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నింటికీ మించి న్యాయస్ధానాల్లో క్లియరెన్స్‌ తీసుకున్నాకే విశాఖకు వెళ్తామని తాజాగా మంత్రులతో సీఎం జగన్‌ చెప్పినట్లు సమాచారం. దీంతో హైకోర్టు విచారణ పూర్తయి తీర్పు వచ్చాకే దర్జాగా విశాఖ వెళ్లాలని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+