కోర్టు ధిక్కరణ: విజయవాడ ఏసీపీకి వారం జైలు శిక్ష, జరిమానా కూడా
అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విజయవాడ ఏసీపీగా పనిచేసిన కే శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ. 1000 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును వారం రోజులపాటు వాయిదా వేసింది హైకోర్టు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఛార్జీషీటు దాఖలు చేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదేశాలచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై కోర్టు విచారణ జరిపింది.

కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఏసీపీ కే శ్రీనివాసరావుకు నాలుగు వారాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
కాగా, గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అమలు చేయకపోవడంతో.. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గిరిజా శంకర్, చిరంజీవి చౌదిరలకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications