ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు-సర్కార్ అలర్ట్-కీలక ఆదేశాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడినట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే ఎన్డీఆర్ఎఫ్, ఎసీడిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. తుఫాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగా గుర్తించాం అక్కడికి బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు.

తుఫాను షెల్టర్‌లు కూడా సిద్ధం చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. చిత్తూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, ప్రాంతాలను ముందుగా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గంటగంటకు ఎంత వర్షపాతం నమోదు అయిందో పర్యవేక్షిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు.సెలవుల్లో ఉన్న అధికారులు కూడా విధుల్లోకి వస్తున్నారన్నారు. వాతావరణ పరిస్దితుల అంచనా కోసం డ్రోన్స్ కూడా వాడుతున్నట్లు అనిత తెలిపారు.












Click it and Unblock the Notifications