హోం మంత్రి అనిత చేసిన పనికి బిత్తరపోయిన బాలయ్య
Nandamuri Balakrishna: తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులతో సమావేశం అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును చంద్రబాబు సమీక్షిస్తోన్నారు. పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తోన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి పలు అంశాలపై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

పార్టీని బలోపేతం చేయడం, క్రియాశీలక సభ్యత్వ నమోదు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చిస్తారు. అధికార టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం, నాయకుల సమన్వయం, పదవుల పంపకాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి అనేక అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు చంద్రబాబు.
ఈ సమావేశం సందర్భంగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణకు ఊహించని ఘటన ఎదురైంది. సమావేశంలో పాల్గొనడానికి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన హోం మంత్రి వంగలపూడి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాద నమస్కారం చేశారు.
పార్టీ నాయకులతో కలిసి బాలకృష్ణ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే.. అప్పటికే అక్కడ ఉన్న వంగలపూడి అనిత నేరుగా ఆయన కాలికి దండం పెట్టారు. ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి సవిత కూడా బాలకృష్ణకు పాద నమస్కారం చేశారు. వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు బాలకృష్ణ. చిరునవ్వుతో పలకరిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంలోనికి వెళ్లారు.












Click it and Unblock the Notifications