మరో ఏడాది సస్పెన్షన్!: రోజాకు షాక్, సారీ చెప్పిన నాని, ఆ ముగ్గురు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా పైన మరో ఏడాది చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించాలని రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఆమె సభకు హజరవ్వాలనుకోవడం, ప్రభుత్వం అడ్డుకోవడం నేపథ్యంలో మూడు రోజులుగా హైడ్రామా కొనసాగుతోంది. ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే అనిత... రోజా పైన ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ శనివారం మధ్యాహ్నం భేటీ అయింది.

ఈ భేటీకి రోజా డుమ్మా కొట్టారు. అనిత హాజరై తన వాదన వినిపించారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి కూడా పెట్టారు. రోజా మాటల వల్ల తాను ఇంట్లోను, పిల్లల దగ్గర, సమాజంలోను అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రివిలేజ్ కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Roja

మండలి బుద్దప్రసాద్‌ కమిటీ మీరు ఏం కోరుకుంటున్నారని తనను అడిగిందని.. శాసనసభలో తనను అవమానించినందున అదే సభలో క్షమాపణ చెబితే సరిపోతుందని తాను చెప్పానని ఆమె విలేకరులతో చెప్పారు.

అనిత ఫిర్యాదు నేపథ్యంలో రోజా పైన మరో ఏడాది సస్పెన్షన్ వేటు విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనిత పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయాలని ప్రివిలేజ్ కమిటీలో రికమెండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన భేటీలో అనితపైన వ్యాఖ్యలు, రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ అంశంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. రోజా పైన ఏడాది సస్పెన్షన్ చర్య పైన సోమవారం సభ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే రోజా పైన ఏడాది సస్పెన్షన్ ఉంది.

అది కోర్టు దాకా వెళ్లింది. అయితే, ఈ కొత్త సస్పెన్షన్ పాత ఏడాది సస్పెన్షన్‌తో పాటు సమానంగా ఉంటుందా, లేక అదనంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. అదనంగా ఉంటే.. రోజా పైన మొత్తం రెండేళ్ల పాటు, లేదంటే ఒకే ఏడాదికి పరిమితం అవుతుందని తెలుస్తోంది. తద్వారా ఆమె కోర్టు దాకా వెళ్లినందుకు అనిత పైన వ్యాఖ్యల రూపంలో ప్రభుత్వం కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు.

ఇదిలా ఉండగా, రోజాతో పాటు కొడాలి నానిలపై కఠిన చర్యలు తీసుకోవాలని సభా హక్కుల సంఘం కూడా నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. మండలి బుద్దప్రసాద్‌ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలనే ఈ కమిటీ కూడా నిర్ధరించవచ్చని అంటున్నారు.

వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలపై మానవతా దృక్పథంతో చర్యలు తీసుకోకూడదని సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.

గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సభాహక్కుల సంఘం శనివారమిక్కడ శాసనసభలోని కమిటీ హాలులో భేటీ అయింది. సంఘం సభ్యులు నందమూరి బాలకృష్ణ, కె రామకృష్ణ, బిసి జనార్దన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జ్యోతుల నెహ్రులు హాజరయ్యారు.

సభలో అనుచితంగా ప్రవర్తించిన వైసిపి ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జ్యోతుల నెహ్రులతో పాటు.. రోజాపై ఫిర్యాదు చేసిన టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితలకు కమిటీ ముందు హాజరుకావాలని నోటీసులిచ్చారు. అయితే గతంలోనూ మూడుసార్లు గైర్హాజరైన రోజా.. ఈ దఫా కూడా హాజరుకాలేదు.

ఆరోగ్యం బాగాలేనందున హాజరుకాలేకపోతున్నానని లేఖ ద్వారా తెలిపారు. సభాసంఘం నోటీసులిచ్చినా.. నాలుగుసార్లు కూడా ఇలా హాజరుకాలేకపోతున్నానని చెప్పడం సరికాదని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. మరోవైపు జ్యోతుల నెహ్రు సభాహక్కుల కమిటీలో సభ్యుడిగా ఉండడమే కాకుండా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన తన వాదనను లేఖ రూపంలో ఇచ్చేశారు.

తాను అన్న మాటలు సభ వాయిదా వేశాక జరిగినవని కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. విచారణకు హాజరైన వారు కమిటీ ముందు, అనంతరం విలేకరులతోను మాట్లాడారు. చెవిరెడ్డి తాను ఆ రోజు సభలో ఏం మాట్లాడానన్నది గుర్తులేదని, గుంపులో అందరితో పాటు ఉన్నానని చెప్పారు. దీనిపై కమిటీ ఆయన మాట్లాడిన మాటలను లిఖితపూర్వకంగా ఇచ్చింది.

Roja

వీడియో క్లిప్పింగులు, బుద్దప్రసాద్‌ కమిటీ నివేదికను కూడా చూపించారు. వాటిల్లో తాను అనని మాటలు కూడా ఉన్నాయని.. అరడజను దొంగలు అన్నానని, హత్య అన్న పదం మాత్రమే వాడానన్నారు. తమ పార్టీని సైకో పార్టీ అని అచ్చెన్నాయుడు అనడంతో తాను స్పందించానన్నారు.

తాను భవిష్యత్తులో ఎలాంటి అప్రజాస్వామిక మాటలు మాట్లాడబోనని, మంత్రులకు కూడా అలాంటి మాటలు మాట్లాడవద్దని సలహా ఇవ్వాలని కోరారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అప్రజాస్వామికంగా మాట్లాడలేదని, భవిష్యత్తులోను మాట్లాడబోనని పేర్కొన్నారు. ఒకవేళ తాను ఏదైనా అప్రజాస్వామికంగా మాట్లాడినట్లు భావిస్తే వాటిని మళ్లీ వాడబోనని వివరణ ఇచ్చారు.

కొడాలి నాని కూడా సభలో తాను మాట్లాడిన మాటలకు సభాహక్కుల సంఘం ముందు క్షమాపణలు చెప్పారు. తాను అదేరోజు సభ ముగిశాక అచ్చెన్నాయుడికి కూడా క్షమాపణలు చెప్పానన్నారు. అచ్చెన్నాయుడు, తాను 2004 నుంచీ మిత్రులమన్నారు. దీంతో కమిటీకి ఏం చెబుతారని సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. కమిటీకి కూడా క్షమాపణలు చెబుతున్నానని నాని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+