ఏపీ ఇంటర్ ఫలితాలు గంట లేటుగా- మంత్రి బొత్స హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ?
ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు విడుదల కావాల్సి ఉంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ చివరి నిమిషంలో ఈ విడుదల కార్యక్రమం ఆలస్యమైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న ఛాపర్ సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం కావడమే ఇందుకు కారణం.

హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుని సాయంత్రం ఐదు గంటలకు మంత్రి బొత్స ఇంటర్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. కానీ హైదరాబాద్ లో ఆయన బయలుదేరాల్సిన చాపర్ లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో దాన్ని సరిచేసి తిరిగి బొత్స ప్రయాణం కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. అనంతరం బొత్స విజయవాడకు బయలుదేరారు.
వాస్తవానికి మంతి బొత్సకు విజయనగరంతో పాటు విజయవాడలోనూ క్యాంపు ఆఫీసులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ లోనూ నివాసం ఉంటున్నారు. దీంతో వారాంతాల్లో హైదరాబాద్ వెళ్తుంటారు. తిరిగి అవసరాన్ని బట్టి విజయవాడ లేదా వైజాగ్ కు చేరుకుంటారు. ఈసారి కూడా అలాగే ఇంటర్ ఫలితాల విడుదల కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరేందుకు సిద్ధం కాగా.. హెలికాఫ్టర్ మొరాయించినట్లు తెలుస్తోంది.
ఇవాళ ఒకే రోజు బొత్సతో పాటు సీఎం జగన్ ప్రయాణించాల్సిన ఛాపర్ కు సైతం సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో జగన్ కూడా ఇవాళ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమం ముగించుకుని పుట్టపర్తికి చాఫర్ బదులుగా రోడ్డు మార్గాన వెళ్లారు. కాసేపట్లో ఆయన పుట్టపర్తి నుంచి మాత్రం గన్నవరానికి చాపర్ లో వెనుదిరగబోతున్నారు.












Click it and Unblock the Notifications