కెవీపీ తెచ్చే పర్సంటేజీలతో జగన్ సభలు,ఆయన సిఎం కాలేడు
ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి:ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపి కెవీపీ రామచంద్రరావు ఢిల్లీ నుండి తెచ్చిన పర్సంటేజీలతో జగన్ సభలు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు.తమ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ది పనులు చేస్తోంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి విమర్శించారు.

ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కంటున్నారని, అది ఎప్పటీకి నెరవేరదన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు.కాంగ్రెస్ పార్టీ ఎంపి కెవీపి రామచంద్రరావుతో జగన్ కు ఉన్న సంబంధాలు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
టిడిపిని విమర్శించేందుకే జగన్ బహిరంగసభలను నిర్వహిస్తున్నారని మంత్రి దేవినేని ఉమ మహేశ్వర్ రావు ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications