Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ ఫ్యాన్స్ చంపుతామని బెదిరిస్తున్నారు.. నైతిక బాధ్యత వహిస్తారా?: పవన్ పై ఏపీ జర్నలిస్ట్ ఫోరం

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు మీడియాపై వ్యవహరిస్తున్న తీరుపై జర్నలిస్టుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయుడబ్ల్యూజే) హెచ్చరికతో కూడిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ జర్నలిస్టు ఫోరం కూడా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

 ఏవి ప్రసారం చేయాలో మీరు చెబుతారా?:

ఏవి ప్రసారం చేయాలో మీరు చెబుతారా?:

పవన్ కల్యాణ్ తల్లిపై అభ్యంతరకర రీతిలో నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను వాస్తవానికి ఏ చానెల్ కూడా ప్రసారం చేయలేదని ఏపీ జర్నలిస్టు ఫోరం స్పష్టం చేసింది. కానీ పవన్ మాత్రం ఆయన తల్లిపై జరిగిన దూషణలను మీడియా ప్రసారం చేసినట్లు భ్రమించి ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టింది. మీడియా ఎలా ఉండాలో, ఏ వార్తలు ప్రచురించాలో లేదా ప్రసారం చేయాలో వేరొకరు నిర్ణయించాల్సిన స్థితిలో ఎవరూ లేరని వ్యాఖ్యానించింది.

జర్నలిజంను శాసించే ప్రయత్నమా?:

జర్నలిజంను శాసించే ప్రయత్నమా?:

మీ సినిమాల్లో స్క్రిప్టు ఎలా ఉండాలో మీడియా జోక్యం చేసుకోవట్లేదు కదా! అని పవన్ కల్యాణ్ ను ఏపీ జర్నలిస్టు ఫోరం ప్రశ్నించింది. మీడియా స్క్రిప్టు చూసి బావుందని చెబితేనే మీరు నటిస్తున్నారా? అని నిలదీసింది. మీ సినిమాలు పలానా విధంగానే ఉండాలని మేం చెప్పట్లేదు కదా.. మీ రాజకీయ పార్టీ పలానా పంథాలోనే నడవాలని మేము అనడం లేదు కదా.. మరి మీరు మాత్రం ఎందుకు జర్నలిజాన్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించింది. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచించింది.

నైతిక బాధ్యత వహిస్తారా?:

నైతిక బాధ్యత వహిస్తారా?:

ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఆరోపణలు, విమర్శలను స్వీకరించడానికి సిద్దంగా ఉండాలని ఏపీ జర్నలిస్టు ఫోరం హితవు పలికింది. అతే తప్ప సంయమనం కోల్పోయి భౌతిక దాడులు చేయడం మీ పార్టీ సిద్దాంతమా? అని ప్రశ్నించింది.

తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మీరు.. ఫిల్మ్ చాంబర్ దగ్గర ఒక మహిళా జర్నలిస్టుపై మీ అభిమానులు చేసిన దాడిని సమర్ధిస్తున్నారా?. మీడియా ప్రతినిధులను చంపుతాం. యాసిడ్ దాడులు చేస్తామంటూ మీ జనసైన్యం బెదిరిస్తోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తారా..? అని నిలదీసింది.

మీడియాను బెదిరిస్తున్నారా:

మీడియాను బెదిరిస్తున్నారా:

మీ ఆధ్వర్యంలోనే మీ అభిమానులు ఏబీఎన్ వాహనాన్ని ధ్వంసం చేయడం, మిగిలిన మీడియా ప్రతినిధులను బెదిరించడం ఎంతవరకు కరెక్టో చెప్పాలని జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేసింది. టీవీ 9, ఏబీఎన్, టీవీ 5 చానెళ్లను బ్యాన్ చేయాలని చెప్పడం ద్వారా మీరు మీ కార్యకర్తలకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? అని ప్రశ్నించింది. మహాటీవీపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ చానెల్ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం సరికాదని హితవు పలికింది.

 మీ కుటుంబానికి అవేవి కనిపించలేదా:

మీ కుటుంబానికి అవేవి కనిపించలేదా:

గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ బారినపడ్డామని ఎందరో మహిళలు వారి ఆవేదనను మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమవుతుంటే.. అవేవి మీకు కనిపించలేదా? అని పవన్ కల్యాణ్ ను జర్నలిస్టు ఫోరం సూటిగా నిలదీసింది. మైనర్ బాలికలను సైతం వదలకుండా లైంగిక దోపిడీకి పాల్పడితే సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న మీరు గానీ, మీ కుటుంబ సభ్యులుగానీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది.

ఏంటీ రెచ్చగొట్టడం?..:

ఏంటీ రెచ్చగొట్టడం?..:

'పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చిన మీరు మీ తల్లిగారిని మరో మహిళ దూషిస్తే.. ఎందుకు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వలేదు?.. మీడియా పట్ల అభ్యంతరాలుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చన్న విషయం మీకు తెలియదా? మీకొచ్చిన కష్టం యావత్తు రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టంలా చిత్రీకరిస్తూ మీ అభిమానులను రెచ్చగొడాతారా? ఇదెంతవరకు సమంజసం.. పార్టీ అధ్యక్షుడిగా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం' అని ఏపీ జర్నలిస్టు ఫోరం ఒక నోట్ ద్వారా వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+