• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎపి భూసేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం:త్వరలో గెజిట్ నోటిఫికేషన్

By Suvarnaraju
|

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లి ఆమోదించిన భూసేకరణ చట్టం 2013 సవరణ బిల్లుకు ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. దీంతో ఒకటి రెండు రోజుల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల కానుంది.

తద్వారా ఈ సవరణలతో కూడిన బిల్లు పూర్తి గా చట్ట రూపం సంతరించుకుని అమల్లోకి వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ మరింత సులభతరం అవుతుంది. మరోవైపు ఈ బిల్లు ద్వారా రైతులకు సంతృప్తికర పరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ చేపడుతామని రెవిన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు.

అప్పటి నుంచి సమస్య...కేంద్రమే

అప్పటి నుంచి సమస్య...కేంద్రమే

భూ సేకరణకు 2013లో కొత్త చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ప్రజావసరాల కోసం నిర్మించే ప్రాజెక్టుల విషయంలోనూ భూసేకరణకు అనేక అడ్డంకులు ఎదురవుతు న్నాయని పాలకుల భావన. అందుకే ఈ చట్టంలో కఠినంగా నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వమే సవరణ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. అయితే దీన్ని బిల్లు రూపంలో పార్లమెంటు ఉభయసభల్లో పాస్‌ చేయించలేకపోవడంతో కేంద్రం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అయితే ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ కు అనుగుణంగా సవరణలు చేసుకునే వెసులుబాటు ఉండడంతో గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని సవరణలు చేసుకున్నాయి.

అదే బాటలో...ఎపి

అదే బాటలో...ఎపి

దీంతో ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకొని ఎపి ప్రభుత్వం కూడా చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును పాస్‌ చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. అయితే ఎపి నుంచి వెళ్లిన ఈ బిల్లు సుదీర్గ కాలం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఎపి దీనిపై అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఒత్తిడి తేగా ఎట్టకేలకు ఈనెల 12న న్యాయశాఖ ఆమోదించింది. అనంతరం బిల్లును కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపారు. ఆ తరువాత ఫైలు రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లింది. రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డ నేపథ్యంలో అధికారికంగా రాజపత్రం (గెజిట్‌)లో ప్రచురించాల్సి ఉంటుంది.

 గెజిట్ తో...చట్టం

గెజిట్ తో...చట్టం

అయితే గెజిట్‌ నోటిఫికేషన్‌ అనంతరం ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వస్తుంది. ఆ రోజు నుంచి సవరణలతో కూడిన కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరుపుకోడానికి వెసులుబాటు కలుగుతుంది. 2013లో యూపీయే-2 అమల్లోకి తెచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సేకరించిన భూమికి పరిహారం అధికమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిహారం మార్కెట్‌ ధరకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్ల వరకు చెల్లించాలి. భూమి కోల్పోయినవారికి మరింత మెరుగైన పునరావాసం కూడా కల్పించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంకా అనేక రకాల పరిహారాలు ఇందులో పేర్కొనడం జరిగింది.

మంత్రి కెఈ...ఏమన్నారంటే

మంత్రి కెఈ...ఏమన్నారంటే

ఈ విషయమై రెవిన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏపీ భూసేకరణ చట్టానికి కేంద్రం ఆమోదించిందని, దీంతో ప్రజా ప్రయోజనాల కోసం సేకరించే భూములను...నేరుగా రైతుల ఆమోదంతో సేకరించడానికి అవకాశముందన్నారు. అయితే తాము రైతులకు సంతృప్తికర పరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల చుక్కల భూములు క్రమబద్ధీకరణ కోసం 60,164 దరఖాస్తులు వచ్చాయని మంత్రి కెఈ తెలిపారు. జూన్ 13 నుంచి స్పెషల్‌ డ్రైవ్ చేపడుతామని కేఈ కృష్ణమూర్తి చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Land Acquisition Act passed by the Andhra Pradesh Assembly in 2013 has finally been approved by the President.Gazette notification will be released shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more