జగన్ కు మంత్రి పయ్యావుల రిక్వెస్ట్..! కీలక ఫైలుపై తొలి సంతకం..

ఏపీలో ఎల్లుండి నుంచి రెండు రోజుల పాటు శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇవాళ శాసనసభా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్.. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో పయ్యావుల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైలుపై తన తొలి సంతకం చేశారు.

ఇవాళ శాసనసభ ప్రాంగణంలో ఉన్న టీడీఎల్పీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసన సభ కార్యాలయంలో పయ్యావుల కేశవ్.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు.

ap legislative affairs minister payyavula Keshav invites ys jagan for assembly session

ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ చేసిన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం.. ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామన్నారు. జగన్ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్వపక్షమైనా, విపక్షమైనా మేమే అన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా తాము సిద్దంగా ఉంటామన్నారు. రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు పయ్యావుల కేశవ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+