ఏపీ లిక్కర్ కేసులో మరో టర్న్ ..! సుప్రీం కీలక నిర్ణయం..!

ఏపీ మద్యం కుంభకోణం కేసు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా సిట్ అరెస్టు చేసిన ముగ్గురికి విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో బెయిల్ ఇచ్చింది. దీన్ని రద్దు చేస్తూ వారు లొంగిపోవాలంటూ హైకోర్టు మరో ఆదేశం ఇచ్చింది. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం గతంలోనే వారికి ఊరటనిచ్చింది. అయితే దీని గడువు ముగుస్తుండటంతో ఇవాళ సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సిట్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

గత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ అప్పటి సీఎం జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పను ఈ కేసులో అరెస్టు చేసింది. మద్యం తయారీ సంస్థల ద్వారా లభించిన ముడుపుల్ని వీరు వైసీపీ పెద్దలకు చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వీళ్లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన తర్వాత వీరు దాఖలు చేసుకున్న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు ఆమోదించింది. దీంతో ఈ ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు.

AP Liquor Scam SC Extends Relief Surrender Deadline for 3 Accused to Jan 21

దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వీరి డిఫాల్ట్ బెయిల్స్ రద్దు చేయడంతో పాటు గత నెల 26 లోపు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల్ని వారు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఇవాళ్టి వరకూ వారిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జనవరి 21 వరకూ పొడిగించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. అలాగే మద్యం కేసులో సిట్ చార్జిషీటును విజయవాడ ఏసీబీ కోర్టు పరిగణన లోకి తీసుకునేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని కూడా సుప్రీంకోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+