ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు: హోంమంత్రిగా మేకతోటి సుచరిత
అమరావతి:ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ తొలి సారి సచివాయంలో అడుగు పెట్టారు. దీని కోసం ఈ ఉదయం 8.39 గంటలను ముహూర్తంగా నిర్ణయించారు. జగన్ కార్యాలయంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగించిన ఛాంబర్‌లో వాస్తు పరంగా కొన్ని మార్పులు చేసారు. ఒకటో బ్లాక్‌లోనే సీఎం కార్యాలయం సిద్దమైంది. ఇక, అధికారిక బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.గవర్నర్ సచివాలయానికి వచ్చి ప్రొటెం స్పీకర్‌గా శంబంగిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఉదయం 8.39 గంలకు జగన్ సచివాలయానికి చేరుకున్నారు. 8.42 గంటలకు తన ఛాంబర్‌లో ప్రవేశించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత నవ రత్నాల్లో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల పైన సంతకాలు చేశారు. అనంతరం 9.30 గంటలకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశంలో పాల్గొన్నారు. జగన్ అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తరువాత గవర్నర్ నరసింహన్ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడే పది నిమిషాలు గవర్నర్ -ముఖ్యమంత్రి భేటీ జరిగింది.ఉదయం 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ మొత్తం 25 మంది చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.













Click it and Unblock the Notifications