సుదీర్ఘ నిరీక్షణకు తెర.. నేడు మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా..!
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్ధుల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఇప్పటికే నిర్వహించిన మెగా డీఎస్సీ-2025కి సంబంధించి తుది ఎంపిక జాబితాను ఈరోజు ( సెప్టెంబర్ 15, 2025 ) విడుదల చేయనున్నారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. వీటిలో సుమారు 16,000 పోస్టులు భర్తీ చేశారు. కొన్ని మేనేజ్‌మెంట్లు, పలు సామాజిక వర్గాల్లో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 300కు పైగా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
అయితే మొదట 600కు పైగా ఖాళీలు మిగిలే పరిస్థితి ఉండగా, వీలైనన్ని ఎక్కువ పోస్టులను భర్తీ చేయడానికి ఏడు విడతలుగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. మిగిలిన పోస్టులను తదుపరి డీఎస్సీలో భర్తీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తుది ఎంపిక జాబితాను జిల్లా కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాలు, అధికారిక వెబ్‌సైట్ cse.apcfss.in లో అందుబాటులో ఉంచనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు.

నియామక పత్రాల పంపిణీ..
ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలోని సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అంతే కాకుండా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం దసరా సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున.. వీరందరినీ విధుల్లోకి నియమించాలనే ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.
డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఏప్రిల్ 20న విడుదల అయ్యింది. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా.. ఆగస్టు 1న తుది కీ ప్రకటించారు. అభ్యర్ధుల ఎంపికలో TET మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చారు. ఇక అభ్యర్థుల సర్టిఫికెట్ల ధ్రువపత్రాల పరిశీలనను 7 విడతల్లో పూర్తి చేశారు.
కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల నియామకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు గణనీయంగా తగ్గనున్నాయి. దీంతో విద్యార్థుల చదువులో నాణ్యత పెరుగుతుందని, గ్రామీణ పాఠశాలల్లో ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications