ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఏపీలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ-2025 నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది విద్యాశాఖ. నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఫలితాలను రూపొందించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో తుది ఫలితాలను, స్కోర్ కార్డులను పొందుపరిచింది. ఇక జూన్ నుంచి జూలై వరకూ ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 3 లక్షల 36 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 92 శాతం మంది హాజరయ్యారు.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వివరంగా పరిశీలించిన తర్వాత సవరించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించి ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్ష రాసిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in ద్వారా తుది ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని తెలిపింది.

అంతేకాక ఇక టెట్ పరీక్ష వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు సంబంధిత https://apdsc.apcfss.in వెబ్ సైట్ లో చూడచ్చని సూచించింది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ తో టెట్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే ఉంటుందని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం .వి. కృష్ణారెడ్డి తెలిపారు. ఇక జూన్ నుంచి జూలై వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 3 లక్షల 36 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 92 శాతం మంది హాజరయ్యారు.












Click it and Unblock the Notifications