జగన్ సోదరుడికి కూటమి ప్రభుత్వం భారీ గిఫ్ట్..!!
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వైసీపీ లక్ష్యంగా రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. పలువురు వైసీపీ ముఖ్య నేత లు సైతం కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇటు వైసీపీ కూటమి ప్రభుత్వం పోరుబాట మొదలు పెట్టింది. ఇదే సమయంలో ఆదాయం తెచ్చి పెట్టే శాఖల్లో చోటు చేసుకుంటున్న నిర్ణయాలు.. వైసీపీ నేతలకు దక్కుతున్న ప్రాధాన్యత పైన ఇప్పుడు కూటమి పార్టీల్లో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.
ఏపీ మైనింగ్ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం పైన రాజకీయంగా వివాదం మొదలైంది. మాజీ సీఎం జగన్ కు సోదరుడు వరుస అయ్యే పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి తాజాగా
దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి నిల్వలున్న లీజును గనుల శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఫైల్స్ కంటే వేగంగా ఈ ఫైల్ ఆమోదించటం వెనుక టీడీపీకి చెందిన ఒక ముఖ్య నేత ఒత్తిడి ఉన్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. వేముల లోని 1021/ 26 ,43 సర్వేలో 11.6 హెక్టార్లలో ముగ్గురాయి ఖనిజ లీజు కోసం 2016లో వెంకటరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వైసీపీ హయాంలో ఆయన ఫైల్ వేగంగా కదిలింది. కాగా, 9.55 హెక్టార్లలో లీజు ఇచ్చేందుకు 2020 లో ప్రతిపాదనలు ఎర్రగుంట్ల మైనింగ్ అధికారులు సమర్పించారు.

ఈ ఫైల్ విషయంలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ప్రత్యేకంగా ఆసక్తి చూపించారు. వెంకట రెడ్డికి 9.55 హెక్టార్లలో 20 సంవత్సరాల కాల వ్యవధితో లీజు ఖరారు చేసారు. లీజు మంజూరు చేస్తూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఖనిజానికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. లీజులో భాగంగా ప్రతీ ఏటా 1390 టన్నుల ముగ్గురాయిని వెలికి తీయనున్నారు. కాగా, మార్కటె లో ప్రస్తుతం టన్ను విలువ 30 వేల నుంచి 35 వేల వరకు ఉంది. ఈ లీజు ఖరారు వెనుక టీడీపీ నేత ఉండటం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. వైఎస్ ప్రతాప్ రెడ్డి కుమారుడే వెంకటరెడ్డి. కాగా, ఇప్పుడు ఈ నిర్ణయం పైన కడప జిల్లా కూటమి నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు.












Click it and Unblock the Notifications