వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్స్‌కు సెలవులు ఇచ్చేది లేదు.. కరోనాపై భయం వద్దన్న మంత్రి సురేష్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ మరో సారి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దాని తీవ్రత అంతగా లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా పాఠశాలలో కరోనా సోకినట్లు నిర్థారణ అయితే ఆ స్కూల్ వరకూ మూసివేస్తామన్నారు. శానిటైట్ చేసిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

Recommended Video

Covid-19 New Guidelines In AP, Issues Night Curfew | Oneindia Telugu
ఉద్యోగుల ఆందోళ‌న చేయాల్సిన అవ‌స‌ర‌మేంటి?

ఉద్యోగుల ఆందోళ‌న చేయాల్సిన అవ‌స‌ర‌మేంటి?

సీఎం జగన్ మోహన్ రెడ్డిలో నిర్వహించి సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్పీకి తొలుత అంగీకరించారని మంత్రి సురేష్ పేర్కొన్నారు. కానీ మళ్లీ ఇప్పుడు అందోళనకు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. అంతే కానీ రోడ్లపైకి వచ్చి దర్నాలు , ఆందోళనలు చేయడం సరికాదని మండిప‌డ్డారు. పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్యోగులు నడుచుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు.

పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు

పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు


రాష్ట్రంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే విద్యాసంస్థలను నడిపిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. యూనివర్శిటీలు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ దాని తీవ్రత అంతగా లేదన్నారు. ప్రస్తుతానికైతే పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని కుండలు బద్దలు కొట్టి చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే విద్యాసంస్థల్లో విద్యాబోధన జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

స్కూళ్లలో కరోనా కలకలం

స్కూళ్లలో కరోనా కలకలం


మరోవైపు రాష్ట్రంలోని స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలో పలు పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దాదాపు 20 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక వైపు కేసులు తీవ్రత పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం విద్యాసంస్థ‌ల‌కు సెలవులు ప్రకటించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

English summary
minister Adimulapu Suresh Serious on Eployees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X