MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ ముహుర్తం ఫిక్స్ ? ఆ రోజే ప్రకటన..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఉన్నా ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెట్ దిగ్గజం, సీనియర్ వికెట్ కీపర్-బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఇప్పుడు రిటైర్మెంట్ కు సిద్దమవుతున్నాడా ? దీనిపై ఎప్పుడు ప్రకటన చేయాలో కూడా నిర్ణయించేసుకున్నాడా ? ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ ఆడేసి రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేక అదీ ఆడకుండానే కీలక ప్రకటన చేయబోతున్నాడా ? ఇలా సవాలక్ష ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది.
ధోనీ ఆడుతున్న సీఎస్కే సూపర్ కింగ్స్ ఇప్పుడు ఐపీఎల్ లో కీలక దశలో ఉంది. మిగిలి రెండు మ్యాచ్ లలో కనీసం ఒక్కటైనా గెలిస్తే కానీ ప్లే ఆఫ్ ఆశలు నిలబడవు. ఇలాంటి సమయంలో ధోనీ రీఎంట్రీ ఇవ్వక తప్పని పరిస్దితి ఉంది. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై చేపాక్ స్టేడియంలో సీఎస్కే మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అది ధోనీ రీఎంట్రీ కావచ్చు లేకపోతే ఆయన రిటైర్మెంట్ ప్రకటన కావచ్చని తెలుస్తోంది.

రేపు సీఎస్కే-సన్ రైజర్స్ మ్యాచ్ లో సర్ ప్రైజ్ ఉంటుందని, ఈ సీజన్ లో చేపాక్ లో ఇదే చివరి మ్యాచ్ అని కామెంటేటర్ హర్షా భోగ్లే తెలిపాడు. చేపాక్ లో అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం వచ్చినా తానేమీ అనుకోబోనని హర్షా వెల్లడించాడు. దీంతో సీఎస్కే హోంగ్రౌండ్ అయిన చేపాక్ స్టేడియంలో ధోనీ కెరీర్ పై తాడోపేడో తేల్చుకునే అవకాశం ఉందని అర్ధమవుతోంది. అయితే ఇన్ని మ్యాచ్ లు ఆడకుండా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చినా మెరుపులు ఉంటాయని ఆశించే పరిస్దితి లేదు. ఇలాంటి పరిస్దితుల్లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటన రావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.














Click it and Unblock the Notifications