రిపోర్టర్‌పై చిందులేసిన అంబటి రాంబాబు
ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఒక మీడియా విలేకరిపై చిందులేశారు. విలేకరికి ప్రశ్నించడం సహజ గుణం. అలా ప్రశ్నించడం మంత్రికి నచ్చలేదు. దీంతో నువ్వు ప్రశ్నలు వేస్తున్నావా? ఉపన్యాసమిస్తున్నావా? అంటూ ఆ విలేకరినే వెటకారంగా ప్రశ్నించారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి అంబటి రాంబాబు సంగం బ్యారేజి పనులు పరిశీలించారు. ఈ పనులన్నింటినీ త్వరలోనే పూర్తిచేసి ముఖ్యమంత్రి జగన్ చేతులమీదగా ప్రారంభింపచేస్తామని ప్రకటించారు. అయితే అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిచేయకుండా సంగం ప్రాజెక్టును ప్రారంభించడం సాధ్యంకాని పని అని, సంగం ప్రాజెక్టును ప్రారంభిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ఒక విలేకరి మంత్రిని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఒక్కసారిగా కస్సుమన్నారు. అంబటి రాంబాబు విలేకరులపై కస్సుబుస్సుమనడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా జరిగిందని, ఆయన్ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడిగినప్పుడు ఇలాగే వ్యవహరిస్తారని ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన విలేకరులు చెప్పారు.

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి పదలు సంఖ్యలో ప్రజలు మృత్యువాతపాలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే అది ఒక మహా విషాదంగా మిగిలిపోయింది. ఆ నీటి ఒరవడికి కొత్తగా నిర్మించిన మూడంతస్తుల భవనం కూడా నిట్టనిలువునా కుప్పకూలిపోవడం బాగా వైరల్ అయింది. త్వరత్వరగా పూర్తికావల్సిన ప్రాజెక్టు పనులు నత్తనడకన జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సంగం ప్రాజెక్టును ప్రారంభించాలంటే అన్నమయ్య ప్రాజెక్టు పూర్తవడంతోపాటు దిగువకు వదిలిన నీటిని నిల్వచేసే సామర్థ్యం కలిగివుండాలి. ఇటువంటి పరిస్థితుల్లో అన్నమయ్య ప్రాజెక్టు పూర్తికావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని జలవనరుల నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications