ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్-మంత్రి అనగాని ట్వీట్..!
ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు తేదీని ప్రకటించింది.
ఇప్పటికే అధికారులు ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాల్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani pic.twitter.com/zJNh0C61aN
— Satya Prasad Anagani (@SatyaAnagani) July 16, 2024
ఏపీలో కూటమి ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేసే ఓ పోస్టర్ ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ఎక్స్ లో షేర్ చేశారు. ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం అంటూ ఈ వివరాల్ని వెల్లడించారు. దీంతో ఇప్పటికే అనుకుంటున్నట్లుగా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు స్పష్టమైంది.
ఇవాళ జరుగుతున్న కేబినెట్ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు తేదీని ప్రభుత్వం ఖరారు చేసే అవకాశముందని ముందే భావించారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన ఎలాగో వెలువడనుంది. అంతకు ముందే రెవెన్యూ మంత్రి అనగాని ఎక్స్ లో ఈ విషయాన్ని లీక్ చేసినట్లయింది. ఏదేమైనా రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ల తర్వాత అమలవుతున్న రెండో హామీ ఇదే కానుంది.












Click it and Unblock the Notifications