ఏపీ రైతులకు యూరియాపై గుడ్ న్యూస్-మంత్రి కీలక ప్రకటన..!
వైసీపీ హయాంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారని, కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు తెరదించిందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవ వలన, కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడటం వలన అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో రాష్ట్రానికి రానుందని ఆయన వెల్లడించారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడా యూరియా సమస్య లేదని, వైసీపీ కావాలని రాజకీయం చేస్తోందని అచ్చెన్న ఆరోపించారు. రబీకి కేంద్రం 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందన్నారు. 130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు విత్తనాలు రాయితీతో అందించామన్నారు. వైసీపీ ఉచిత పంటల భీమా పేరుతో మోసం చేసిందని, తన ప్రభుత్వం రైతులకు సమయానికి పరిహారం అందిస్తోందన్నారు.

ఉల్లికి క్వింటాకు వైసీపీ రూ.770 మాత్రమే ప్రకటిస్తే, కూటమి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేస్తోందని వ్యవసాయమంత్రి తెలిపారు. టొమాటో, మామిడి, మిర్చి, కోకో, పొగాకు ధరలు పడిపోతే తమ ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. పశు భీమా పరిహారం రూ.37,500 నుండి రూ.50,000/-కి పెంచి రైతులపై భారాన్ని తగ్గించామన్నారు.

మత్స్యకారుల భృతి రూ.10,000 నుండి రూ.20వేలకు లకు పెంచి 1.21 లక్షల కుటుంబాలకు 242.8 కోట్లు చెల్లించామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50/- సబ్సిడీ రేటుతో విద్యుత్ అందిస్తున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్, ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా మార్చామని చెప్పుకొచ్చారు. అన్నదాత సుఖీభవ పథకంలో 46.86 లక్షల మంది రైతులకు రూ.3,174 కోట్లు చెల్లించామన్నారు.












Click it and Unblock the Notifications