ప్రైవేటు జెట్ లో ఏపీ మంత్రి-విదేశీ పర్యటన : ఆయన రూటే సపరేటు..!!

ఏపీ మంత్రి ప్రయివేటు జెట్ లో విదేశీ పర్యటనకు వెళ్లటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మంత్రి తన పర్యటన గురించి తానే సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇక, దీని మీద టీడీపీ నేతలు వదులుతారా. మొదలెట్టేసారు. ఏపీ విద్యుత్-అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రష్యా పర్యటన ఇప్పుడు ఇటు ప్రతిపక్షాలతో పాటుగా సొంత పార్టీలోనూ చర్చకు కారణమవుతోంది. కరోనా కారణంగా మంత్రులంతా పర్యటనలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టటంతో అధికారిక- అనధికారిక పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మంత్రి బాలినేని విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

జెట్ విమానంలో మంత్రి బాలినేని..

జెట్ విమానంలో మంత్రి బాలినేని..

అయితే, బాలినేని శ్రీనివాస రెడ్డి రష్యా పర్యటన కోసం ఒక జెట్ విమానంలో బయల్దేరారు. ఆ విమానం చాలా విలాసవంతంగా కనిపిస్తోంది. స్వయంగా ఆ విమానంలో ఆయన ఉన్న ఫొటోను మంత్రి సిబ్బందే షేర్ చేసారు. అందుకు ఒక క్యాప్షన్ సైతం జోడించారు. కారణాలు అన్వేషించ కుండా..హాయిగా జీవించండి అంటూ ట్యాగ్ తగిలించారు. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇక, టీడీపీ నేతలు తమకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా..ఈ ఫొటోకు తమ సహజ ధోరణలో పోస్టింగ్ లు రాస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

రష్యా పర్యటనకు మంత్రి..కారణం ఏంటి..

రష్యా పర్యటనకు మంత్రి..కారణం ఏంటి..

అయితే, మంత్రి బాలినేని తాను రష్యా వెళ్తున్నట్లుగా ఫొటోలో స్పష్టం చేసారు. ఆ ఫొటోలో అధికారులు ఎవరూ ఉన్నట్లుగా కనిపించటం లేదు. అయితే, తన పర్యటన అధికారమా లేక వ్యక్తిగత పర్యటన అనే విషయం స్పష్టం చేయలేదు. అధికారిక పర్యటన అయితే, శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు. సాధారణంగా మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకుంటారు. జీఏడీ వారికి అనుమతి రాగానే సంబంధిత శాఖలకు..అధికారులకు సమాచారం ఇస్తూ అధికారికంగా వారి పర్యటన ఉత్తర్వులు జారీ చేస్తుంది.

రాజకీయంగా ఆసక్తి కరంగా..

రాజకీయంగా ఆసక్తి కరంగా..

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో ఉంచటం లేదు. దీంతో..బాలినేని పర్యటనకు సంబంధించి జీవో లో ఏముందనేది తెలయలేదు. అధికారిక పర్యటన అయితే, జెట్ విమానంలో వెళ్తూ ఫొటోలు పెట్టి ప్రచారం చేసుకొనే అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, అసలు వ్యక్తిగత పర్యటన అయితే రష్యాకు ఎందుకు వెళ్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ గా మారిపోయింది. తన ప్రయాణిస్తున్న విమానం..తన విదేశీ పర్యటన గురించి వివరించిన మంత్రి..ఆ వివరాలు మాత్రం వెల్లడించ లేదు.

దీంతో.. ఇప్పుడు ఇది రాజకీయంగా వేడి పుట్టించే చర్చకు కారణం కానుంది. మరి..దీని పైన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రభుత్వంలోని మంత్రి కావటంతో దీని గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+