'అమ్మ చావుకు కారణమిదే': షర్మిలను ఇష్యూలోకి లాగిన అఖిలప్రియ
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను పురస్కరించుకొని అధికార టిడిపి, వైసీపీలు సెంటిమెంట్ అస్త్రంగా చేసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నాయి. షర్మిల కోసం వెళ్ళి తన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించారని ఏపీ
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను పురస్కరించుకొని అధికార టిడిపి, వైసీపీలు సెంటిమెంట్ అస్త్రంగా చేసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నాయి. షర్మిల కోసం వెళ్ళి తన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించారని ఏపీ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు.
వైసీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును, మంత్రి భూమా అఖిలప్రియను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అయితే మంత్రి భూమా అఖిలప్రియ కూడ వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నంద్యాలలో ఏర్పాటు చేసిన సభలో టిడిపిపై గురువారం నాడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు టిడిపి నాయకులు కూడ ప్రతి విమర్శలు చేశారు.
వైఎస్ సోదరి షర్మిల కోసం వెళ్ళి అమ్మ శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు.
వైఎస్ ఫోటో పెట్టుకొని జగన్ ప్రచారం చేస్తున్నారు. నా తల్లిదండ్రుల ఫోటో పెట్టుకొంటే తప్పేమీటని
ఆమె ప్రశ్నించారు. షర్మిల కోసం వెళ్ళే అమ్మ చనిపోయిందనే విషయాన్ని వైఎస్ జగన్ ఎలా మర్చిపోయారో అర్ధం కావడం లేదన్నారు. శిల్పా సోదరులు తమపై విమర్శలు చేయడం దారుణమన్నారు.












Click it and Unblock the Notifications