వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణతో సఖ్యతే కోరుకుంటున్నాం: కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేసిన బొత్స సత్యనారాయణ

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో గొడవపడాలని తాము ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు. మంగళవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నామని, అన్నదమ్ముల్లా ఉండాలన్నదే తమ కోరిక అని బొత్స వ్యాఖ్యానించారు. తగవు పడాలనే ఆలోచనే తమకు లేదన్నారు. ఆంధ్ర ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదివరకు చెప్పారని గుర్తు చేశారు. అలా అన్నారో లేదో కేసీఆరే చెప్పాలన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలోనే జల వివాదం సమసిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 AP minister Botsa Satyanarayana response on telugu states water dispute issue.

విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతన్నారన్నారు. కేంద్ర దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. రాజధాని చట్టం ఆమోదించిన రోజు నుంచే 3 రాజధానులు అమల్లోకి వచ్చాయని మంత్రి బొత్స తెలిపారు. టీడీపీ ఎన్ని అడ్డకుంలు సృష్టించినా వాటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు. ఇక ఏపీలో ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలేనని మంత్రి బొత్స అన్నారు. దళారులు లేకుండా పారదర్శక పన్ను విధానం రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని పన్ను విధానాలనూ పరిశీలించి, అత్యుత్తమ పన్ను విధానాన్నే రాష్ట్రంలో తీసుకొచ్చామని తెలిపారు.

Recommended Video

Ind Vs Eng : Playing XI అంచనా.. Pujara పైన Kohli నమ్మకం || Oneindia Telugu

తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి అదనంగా రూ. 123 కోట్లు కేటాయించినట్లు మంత్రి బొత్స తెలిపారు. ఆస్తి పన్ను పెంపు 15 శాతానికి పరిమితం చేశామని, ఇది చాలా తక్కువని అన్నారు. ఇక అమర్ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తప్పుచేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారన్నారు. వాళ్లు వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు.

కాగా అమర్‌ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. తప్పు చేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారని తెలిపారు. వాళ్లు వెళ్లిపోవాలని మేము కోరుకోవడం లేదన్నారు. ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జల వివాదంలో తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నట్లు వెల్లడించారు. జల వివాదాన్ని పరిష్కరించు కోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. చట్టం చేసిన రోజే 3 రాజధానులు అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇక రాజధానుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు.

English summary
AP minister Botsa Satyanarayana response on telugu states water dispute issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X