ఏపీ మంత్రి ఇంట మెగాస్టార్ సందడి - తెలంగాణ మంత్రి హరీష్ సైతం : రాజకీయ ప్రముఖులు అక్కడే..!!
రాజకీయాలు..పార్టీలు..అన్నింటికీ అతీతంగా ఒక శుభకార్యంలో అందరూ ఒకే చోట కలిసారు. సందడి చేసారు. ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఇంట జరిగిన ఆయన కుమారుడి నిశ్చితార్ద వేడుక ఘనంగా నిర్వహించారు. ఏపీ మంత్రి ఆహ్వానం మేరకు ఈ వేడుక కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో ప్రధానంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బొత్సా - చిరంజీవి మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి.

బొత్సా ఇంట వేడుకలో మెగాస్టార్
చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఆయన కేంద్ర మంత్రిగా... బొత్సా ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా పని చేసారు. మెగా కుటుంబంతోనూ బొత్స సత్సంబంధాలు కొనసాగించారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సైతం బొత్సా పరిస్థితి పైన జాలి పడుతూ వ్యాఖ్యలు చేసారు. పీసీసీ చీఫ్ గా పని చేసిన బొత్సా లాంటి వారు..ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారా లేదా కూడా తెలియని పరిస్థితి ఉందంటూ కామెంట్ చేసారు. పవన్ కళ్యాణ్ చేసే రాజకీయ వ్యాఖ్యల పైన స్పందించే బొత్సా..ఈ వ్యాఖ్యల పైన మాత్రం స్పందించలేదు.

మంత్రి హరీష్ హాజరు
ఇక, ఈ రోజున జరిగిన బొత్సా కుమారుడి నిశ్చితార్ధ వేడుక లో మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం హాజరయ్యారు. చిరంజీవి వేదిక పైకి రావటంతోనే పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు హాజరై వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయినా, మంత్రి బొత్సా ఆహ్వానించటంతో వచ్చి కాబోయే వధూ వరునుల ఆశీర్వదించి వెళ్లారు.

రాజకీయ ప్రముఖలు రాక
కేవీపీ రామచంద్రరావు, జానారెడ్డి, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా..పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇప్పుడు బొత్సా ఇంట జరిగిన ఈ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణకు చెందిన వివిధ రంగాలకు చెందిన వారు సైతం బొత్సా ఇంట వేడుకలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications