ఇదీ తెలుగు తమ్ముళ తీరు: క్రికెట్ బెట్టింగ్‌లో ఏపీ మంత్రి ముఖ్య అనుచరుడు?
క్రికెట్ బుకీల వ్యవహారంపై జిల్లా ఎస్పీ రామక్రుష్ణ ద్రుష్టి సారించడంపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహించారని వార్తలొచ్చాయి.
అమరావతి: అధికారం అందుబాటులో ఉంటే ఎన్ని పనులైనా ఏం చక్కా చేసేసుకోవచ్చు. అందుకు ప్రజాప్రతినిధిగా ఏదో ఒక పదవి సంపాదించుకోవాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మినహాయింపు కాదు. ఇరు పార్టీలు మహా నేతలకు వారసత్వంగానే సాగుతున్నాయి.
కానీ ఆచరణకు వచ్చేసరికి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, శ్రేణులు అనుసరిస్తున్న వ్యూహాలే ప్రజాప్రగతి సంగతలా ఉంచితే.. బెట్టింగ్‌ల పేరిట మామూలు జనం గోళ్లు ఊడగొట్టేందుకు వెనుకాడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. క్రికెట్ బుకీల వ్యవహారంపై జిల్లా ఎస్పీ రామక్రుష్ణ ద్రుష్టి సారించడంపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహించారని వార్తలొచ్చాయి.

అదీ తెలుగుదేశం పార్టీ జిల్లా సమీక్షా సమావేశంలోనే జిల్లా మంత్రులు.. ఇన్ చార్జి మంత్రుల సాక్షిగా ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. అయితే జిల్లాకు చెందిన మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉండటం గమనార్హం. కానీ ఎస్పీ చొరవతో ప్రత్యేక పర్యవేక్షణ సాగిస్తూ చేపట్టిన 'బుకీల' విచారణ పర్వం సంచలన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చిందన్న మాట నిష్ఠూర సత్యమే మరి.
గత నెల రెండో తేదీన ఒక పేకాట స్థావరంపై దాడి చేసి.. అందులో పాల్గొన్న వారిని విచారించడంలో వెలుగు చూసిన నిజాలు.. క్రికెట్ బుకీలు, పేకాట రాయుళ్ల ఆట కట్టించే దిశగా సాగాయి. అంతర్జాతీయ క్రికెట్ బుకీ క్రుష్ణ సింగ్ అరెస్ట్‌తో పలు విషయాలు బయటకు వచ్చాయి. ఒక మంత్రి ముఖ్య అనుచరుడు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.
అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల అనుచరులు బుకీల పర్వంలో సభ్యులుగా ఉన్నారని తెలుస్తున్నది. కానీ అధికార టీడీపీ నేతలను వదిలేసి తమపై పోలీసులు కేసులు అనవసరంగా నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. అది వేరే సంగతి.
Recommended Video

ఇదీ అసలు కథ
గత నెల రెండో తేదీన నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ ఎదురుగా పేకాట ఆడుతున్నట్లు ఎస్పీకి అందిన సమాచారం మేరకు దాడి చేశారు. మాజీ జెడ్పీటీసీ తుంగా ఇంధూదర్ రెడ్డి, వెంకటేశ్ అలియాస్ చంటి తదితరులను అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ బుకి క్రుష్ణ సింగ్ సహా మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రుష్ణసింగ్ ను గత నెల 20న పోలీసులు అదుపులోకి తీసుకుని, నెల్లూరుకు తరలించి తమదైన శైలిలో విచారిస్తే 15 మంది బుకిలీ జాబితా తయారైంది.
ఇందులో రాష్ట్ర మంత్రి ముఖ్య అనుచరుడి సహకారం ఉన్నదని, బుచ్చిరెడ్డిపాళెం వాసి అరుణ్ అనే ప్రధాన బుకీ ఉన్నారని తేలిపోయింది. గమ్మత్తేమిటంటే క్రుష్ణసింగ్ విదేశాలకు పారిపోవాలని భావించినా దురద్రుష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిపోయి పోలీసులకు చిక్కాడు. పొదలకూరు బుకీ శ్యాం ప్రసాద్ ను విచారించారు. మరో 35 మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారని ఎస్పీ గుర్తించారు.
క్రికెట్ బెట్టింగ్‌లో ఫైనాన్సియర్లుగా ఆంజనేయులు, డీటీఎస్, శ్రీధర్ రెడ్డి, నాగార్జున రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సత్వరం ముగించేయాలని ఆదేశాలు అందాయి. గత నెల 29న హైదరాబాద్ నగరంలో తల దాచుకున్న నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేటర్ రూపుకుమార్, శ్రీధర్ రెడ్డి, కొండూరు అనిల్ బాబు, సునీల్ రెడ్డి, అల్లూరు అనిల్ రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నా.. కొండూరు అనిల్ బాబు పోలీసుల కన్నుగప్పి పరారైనట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై పోలీసు శాఖ అధికారులు న్యాయశాఖ సలహా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. క్రికెట్ బెట్టింగ్ లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీలు వెంకటరాయుడు, శ్రీనివాస్‌లను వీఆర్ పై పంపుతూ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు జారీచేశారు. మరో ఇద్దరు సీఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
అజ్ఞాతంలోకి ప్రధాన సూత్రధారులు
క్రికెట్ బెట్టింగ్‌లపై ఎస్పీ రామక్రుష్ణ కొరడా ఝుళిపిస్తుండటంతోపాటు పోలీసు నిఘా పెరగడంతో పలువురు ప్రధాన సూత్రధారులు అజ్నాతంలోకి వెళ్లారని వార్తలొచ్చాయి. కొందరు తమ పేర్లు బయటకు వస్తాయేమోనని అధికార తెలుగుదేశం పార్టీ నేతల వద్ద ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కోట మండలమే ప్రధాన స్థావరంగా కార్యకలాపాలు సాగాయి. నెల్లూరు, గూడురు, హైదరాబాద్ నగరాలకు చెందిన బుకీలు నాలుగేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు రూ. వేల నుంచి రూ. లక్షల వరకు పందాలు కాసి నష్టపోయారు. ఎనిమిదేళ్లుగా కోట మండలం విద్యానగర్ పట్టణ వాతావరణాన్ని తలపిస్తోంది. విద్యాసంస్థలు, వ్యాపార లావాదేవీలకు అనువుగా ఉంది.చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొందరు స్థిరపడ్డారు. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులకు తొలుత వల విసిరిన బుకిలు.. ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లో మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు బెట్టింగ్ జరిపారు. పాల్గొనే వారు రూ.5000 నుంచి రూ. లక్ష వరకు ఆన్ లైన్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బెట్టింగ్ రాయుళ్లతో బుకిలు ఆన్ లైన్ లో, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటూ లావాదేవీలు సాగిస్తుంటారు.
ఇలా దివాళా తీసిన వ్యాపారులు
సూళ్లూరిపేట పట్టణ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రైస్ మిల్లులో బెట్టింగ్ జోరుగా సాగింది. ఇందులో పాల్గొన్న సూళ్లూరిపేట పట్టణ వ్యాపారి మొత్తం పోగొట్టుకుని ఇంటి ముఖం చూడలేక పారిపోయాడు. బంధువులు వెతికి ఇంటికి తీసుకొచ్చి గప్ చిప్ అయ్యారు. కావలిలో ప్రముఖులుగా ఉంటూ బెట్టింగ్ జరిపినట్లు తెలుస్తున్నది. క్రికెట్ బుకీ క్రుష్ణ సింగ్‌తోపాటు మరో తొమ్మిది మందికి ఇందులో సంబంధం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. వీరందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు చెప్తూ న్యాయస్థానంలో వీరిని ప్రవేశపెడతారని భావిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications