ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తాం: కామినేని

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తామని ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మంగళవారం నాడు ప్రకటించారు.సుప్రీంకోర్టులో ఫాతిమా కాలేజీ విద్యార్థుల కోసం రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని మంత్రి చెప్పారు.

అమరావతిలో మంత్రి కామినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం నుండి ఫీజును తిరిగి ఇప్పిస్తామని మంత్రి ప్రకటించారు.ఎంసిఐతో చర్చించనున్నట్టు మంత్రి ఫాతిమా కాలేజీ విద్యార్థులకు హమీ ఇచ్చారు. ఆర్‌ఎంపి, పిఎంపిలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.

Ap minister Kamineni Assures to Fatima college students

అంతేకాదు వారితో వైద్యం చేసేలా అనుమతి కూడ ఇస్తామని మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఫాతిమా కాలేజీ విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై పోరాటానికి సిద్ధమయ్యారు. మంగళవారం విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. 2015-16 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ధర్నాకు దిగారు. విద్యార్థులకు ప్రజాసంఘాలు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలు మద్దతుగా నిలిచాయి. తమకు న్యాయం జరిగే వరకు విజయవాడ నుంచి వెళ్లేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. తమకు సీఎం చంద్రబాబు ఒక్కరే సహాయం చేయగలరని, ఆయన పట్టించుకుంటే తమ పని అవుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap medical and health minister Kamineni Srinivasa rao assured for justice to Fatima college students. He spoke to media at amaravati on Tuesday. He said that Ap governament will file a rivision petition in supreme court on Fatima college.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి