ఏపీ రాజకీయాలపై మాట్లాడే అర్హత తెలంగాణా మంత్రులకు లేదు: ఏపీ మంత్రి సంచలనం
టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ పాలనపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలపై తమదైన శైలిలో తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక ఏపీలో రోడ్లు, ఏపీలో పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ,ప్రత్యేక హోదా,రాజధాని వ్యవహారంపై పదేపదే వ్యాఖ్యలు చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ మంత్రుల పై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ సంస్కృతిని కాపాడలేకపోతున్న మంత్రులు ఏపీ పై మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడే అర్హత తెలంగాణ మంత్రులకు లేదన్నారు. ఆంధ్ర ప్రజల వల్లే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఆ విషయం మరిచిపోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అక్కడి ప్రతిపక్షాలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయని పేర్కొన్న మంత్రి కొట్టు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి బీఆర్ఎస్ మంత్రులకు ఏం అర్హత ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ ఆధారంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పేర్కొన్న ఆయన అది మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంతోషం ఏపీలో ఉందని దానికి జగన్ ప్రభుత్వమే కారణమని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రులు వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్ ఏంటో చూసుకోవాలని హితవు పలికారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజినీకాంత్ వచ్చి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా అయోగ్యులను పొగిడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని రజినీకాంత్ గీత దాటి మాట్లాడారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.రజినీకాంత్ అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అన్నారు.
కాపు నాయకుడైన ముద్రగడ పద్మనాభం ని రకరకాలుగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అని పేర్కొన్న కొట్టు సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ దీనిపై ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి బహిరంగ సభలో ఒక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!











Click it and Unblock the Notifications