వినాయక చవితికి నారా లోకేష్ గుడ్ న్యూస్, మండపాలకు ఉచిత విద్యుత్

వినాయక చవితి వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు విద్యా, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో వెలిసే పూజా మండపాల నిర్వాహకులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

ఈ నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన మంత్రి లోకేష్, "ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గణేషుని మండపాలకు ఉచితంగా విద్యుత్‌ను అందించబోతున్నామని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాను" అని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలను మరింత వైభవంగా, అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రజా సంఘాలు, ఉత్సవ కమిటీలకు మద్దతుగా నిలిచేందుకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

AP Minister Nara Lokesh Announces Free Electricity for All Ganesh Pandals Across Andhra Pradesh
ఈసారి ఇంట్లోనే వినాయక చవితి..! అమెరికాలో మెసేజ్ లు పంపుకుంటున్న భారతీయులు..!
ఈసారి ఇంట్లోనే వినాయక చవితి..! అమెరికాలో మెసేజ్ లు పంపుకుంటున్న భారతీయులు..!

భక్తులకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన పండుగ శుభాకాంక్షల సందేశాన్ని అందించారు. ఆ విఘ్ననాయకుడైన శ్రీ గణపతి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యం, ఆనందం, సమృద్ధి, విజయాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

వినాయక చవితి 2026:
వినాయక చవితి 2026:

నిర్వాహకులకు దక్కిన ఊరట

సాధారణంగా వినాయక చవితి నవరాత్రుల సమయంలో విద్యుత్ శాఖ వద్ద అనుమతులు పొంది, తాత్కాలిక కనెక్షన్ల కోసం నిర్వాహకులు వేల రూపాయలు రుసుములు చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మండపాల వద్ద విద్యుత్ లైటింగ్, మైక్ సెట్లు, సౌండ్ సిస్టమ్స్ ఇతర ఆకర్షణీయమైన డెకరేషన్ల ఏర్పాటుకు విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వినాయక ఉత్సవ కమిటీల ప్రతినిధులు, భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+