మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ఫిక్స్.. షెడ్యూల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి వివరాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే 'స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్'లో పాల్గొనాలని.. మంత్రికి హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన పత్రం పంపారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకోబడిన ప్రముఖ నాయకులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం..
కాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరులు, సాంకేతికత, ఆర్థికాభివృద్ధి రంగాల్లో తీసుకుంటున్న ఆధునిక విధానాలను అభినందిస్తూ ఈ ఆహ్వానం అందించింది. రాష్ట్రంలో డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పెట్టుబడులు, ఇన్నోవేషన్ విధానాలపై లోకేష్ చూపుతున్న దృష్టి ఆస్ట్రేలియా అధికారులను ఆకట్టుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆస్ట్రేలియాతో విద్యా మరియు పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే వేదికగా ఈ పర్యటన కీలకంగా మారనుంది.

ఈ పర్యటనలో లోకేష్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి విద్యాసంస్థల్లో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధునాతన విద్యావిధానాలు, నైపుణ్య శిక్షణ పద్ధతులు, పరిశోధనా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు.
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్..
ఇక పర్యటనలో భాగంగా లోకేష్ నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2025ను విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియాలో రోడ్ షోల్లో పాల్గొననున్నారు. ఆయన ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై.. ఐటీ, విద్యా, రవాణా, మౌలిక సదుపాయ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు.
పర్యటన వివరాలు..
19 అక్టోబర్: ఉదయం 11.30 గంటలకు సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రజలతో మమేకం అవుతారు.
20 అక్టోబర్: ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (UNSW) సందర్శన, మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం. తరువాత సాయంత్రం 3 గంటలకు TAFE NSW Ultimo క్యాంపస్ సందర్శనలో పాల్గొని స్కిల్స్ & ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్తో చర్చలు జరుపుతారు. రాత్రి 6.30 గంటలకు NSW పార్లమెంట్ హౌస్ వద్ద సీఐఐ రోడ్ షోలో పాల్గొంటారు.
21 అక్టోబర్: ఉదయం 8.30 గంటలకు సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (Seafood Industry Australia) ఆధ్వర్యంలో Centre for Australia India Relations (CIAR) సమావేశం, అనంతరం 11 గంటలకు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU) సందర్శన. మధ్యాహ్నం 2 గంటలకు NSW ఇన్నోవేషన్, సైన్స్ & టెక్నాలజీ మంత్రి అనౌలాక్ చాంథివోంగ్ మరియు స్కిల్స్, టెరిటరీ ఎడ్యుకేషన్ మంత్రి స్టీవ్ వాన్లతో సమావేశం జరగనుంది.
22 అక్టోబర్: ఉదయం 9 గంటలకు గ్రిఫిత్ యూనివర్సిటీ, గోల్డ్ కోస్ట్ సౌత్ పోర్ట్ సందర్శన, మధ్యాహ్నం 2 గంటలకు క్వీన్స్‌ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్, తరువాత 3 గంటలకు క్వీన్స్‌ల్యాండ్ మంత్రితో సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబోయే అధునాతన స్పోర్ట్స్ స్టేడియం ప్రాజెక్టుపై ఆర్కిటెక్ట్‌ల టీమ్‌తో సమావేశమవుతారు.
23 అక్టోబర్: ఉదయం 9.30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ సందర్శన, మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్, ఎకనమిక్ గ్రోత్ & జాబ్స్ మంత్రి డానీ పియర్సన్తో సమావేశం. సాయంత్రం 4.30 గంటలకు యర్రా వ్యాలీలోని ప్రసిద్ధ వైన్ ఇండస్ట్రీ సందర్శించి ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో భేటీ.
24 అక్టోబర్: ఉదయం 9 గంటలకు ఆస్ట్రేలియన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్‌లో పాల్గొంటారు. 11.30 గంటలకు మెల్‌బోర్న్ గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఏఐబీసీ సీఐఐ పార్టనర్‌షిప్ రోడ్ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా క్రికెట్ గ్రౌండ్ సందర్శించి, అక్కడి స్పోర్ట్స్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నమూనాలను పరిశీలిస్తారు. రాత్రి మెల్‌బోర్న్ నుండి బయలుదేరి, 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
ఈ పర్యటనలో విద్య, నైపుణ్య అభివృద్ధితో పాటు క్రీడా రంగం మౌలిక సదుపాయాలపై కూడా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆస్ట్రేలియాలోని అత్యాధునిక స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాల్లో అంతర్జాతీయ ప్రమాణాల స్టేడియాలు నిర్మించాలన్న దిశగా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ సందర్శన ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లు, ఎక్స్చేంజ్ స్కాలర్‌షిప్‌లు వంటి అవకాశాలు సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications