ఈసారి అమరావతికి సింగపూర్ సపోర్ట్ ఇదే..! తేల్చేసిన నారాయణ..!

ఏపీలో ఒకప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతో పాటు ఇతర పనుల్లోనూ పాలుపంచుకునేందుకు పలు ఒప్పందాలు చేసుకున్న సింగపూర్ పేరు ఈసారి వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సింగపూర్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, లోకేష్ వంటి వారు అక్కడి సంస్థలతో లాబీయింగ్ కు ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు సింగపూర్ పర్యటన పూర్తయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోవడంతో లాబీయింగ్ ఫలించలేదని అంతా భావించారు.

ఇలాంటి సమయంలో చంద్రబాబుతో పాటు సింగపూర్ లో పర్యటించి, ఆయన వచ్చేసిన తర్వాత కూడా అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరిపిన మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాల కీలక ప్రకటన చేశారు. 2014-19 మ‌ధ్య కాలంలో సింగ‌పూర్ లోని మెజారిటీ షేర్ ఉన్న కంపెనీల‌తో అగ్రిమెంట్ చేసుకున్నామ‌ని, గ‌త ప్ర‌భుత్వం ఆ ఒప్పందం ర‌ద్దు చేయ‌డంతో పాటు సీఐడీ అధికారుల‌ను పంపి విచార‌ణ చేయించిందన్నారు.

ap minister Narayana clarified to Singapore support to Amaravati capital amid rumours

దీంతో ఆ ప్ర‌భుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలు దెబ్బ‌తాన్నాయని నారాయణ తెలిపారు. తిరిగి ఆ సంబంధాలు పున‌రుద్ద‌రించడానికే సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని గుర్తుచేశారు. దీనికి సింగ‌పూర్ ప్ర‌భుత్వాధికారులు ఎంతో పాజిటివ్ గా స్పందించార‌ని అన్నారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి సీఎం చంద్ర‌బాబు అంటే ఎంతో గౌర‌వం ఉంద‌ని, అయితే ప్ర‌పంచ బ్యాంకుతో క‌లిసి అమ‌రావ‌తికి స‌హ‌కారం అందించేందుకు సింగ‌పూర్ ప్ర‌భుత్వం ముందుకొచ్చింద‌న్నారు.

ap minister Narayana clarified to Singapore support to Amaravati capital amid rumours

అలాగే సింగ‌పూర్ కంపెనీల‌ను విశాఖ‌లో జ‌రిగే భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు రావాల‌ని సీఎం ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. త‌ర్వాత సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ అధికారికంగా లేఖ రాసిన త‌ర్వాత సంప్ర‌దింపులు చేస్తార‌ని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన ప్రకటనల్లో సింగపూర్ కన్సార్టియం ఈసారి రాజధానికి సహకరించలేకపోయినా, ఇక్కడి నిర్మాణాలకు సహకారం అందిస్తుందని తెలిపింది. ఇప్పుడు నారాయణ కూడా సాంకేతిక సహకారం మాత్రమే ఉంటుందని తేల్చేశారు.

వాస్తవానికి గత చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు వచ్చిన సింగపూర్ కన్సార్టియానికి అప్పట్లో ఇక్కడి రైతులు ఇచ్చిన భూములు కూడా ఆఫర్ చేసారు. అయితే జగన్ హయాంలో అమరావతి స్ధానంలో మూడు రాజధానులు ఏర్పాటు నేపథ్యంలో సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాన్ని రద్దు చేసారు. దీంతో సింగపూర్ అమరావతి వదిలి వెళ్లిపోయింది. అంతే కాదు ఇప్పుడు మరోసారి రాజధాని నిర్మాణానికి గతంలో చేసుకున్న ఒప్పందాలు పునరుద్ధరించుకోవాలని కోరుతున్నా ముందుకు రావడం లేదు. అయితే సాంకేతిక సహకారం మాత్రం అందిస్తామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+