ఉసురు తగులుతుంది: కెసిఆర్‌పై పల్లె, జంపింగ్స్‌పై కాల్వ

AP Minister Palle blames T CM KCR
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తగులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రసార, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం అన్నారు. లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టనష్టాలతో ఉంటే విద్యుత్ అంశం, పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాద్దాంతం చేయడం సరికాదన్నారు.

ఇప్పటికే కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తగిలిందన్నారు. రూ.13.2 లక్షల కోట్ల కేంద్ర, రాష్ట్ర, ప్రయివేటు పెట్టుబడులున్న హైదరాబాద్ నగరం తెలంగాణకే చెందుతున్న పోలవరం ముంపు గ్రామాలపై ఆ ప్రభుత్వం వివాదం రేపడం సరికాదన్నారు. పోలవరం ముంపు గ్రామాలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ (పిపిఎ)లపై కెసిఆర్ ఇకనైనా రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. న్యాయబద్ధమైన కేటాయింపులకు అంగీకరిస్తామని, న్యాయబద్ధంగా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థిల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు.

విభజనతో తీవ్ర అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పిపిఎలను రాజకీయం చేస్తే కెసిఆర్‌కు తమ ఉసురు తగులుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండాపోయిందని ఆయన చెప్పారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ 17 వేల కోట్ల లోటు బడ్జెట్‌లోకి వెళ్లిందని, ఒకవేళ విద్యుత్ ఉత్పత్తి తక్కువైతే కనీసం కొనుక్కోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై పల్లె మండిపడ్డారు. 1956కు ముందున్న తెలంగాణే కావాలన్న కెసిఆర్ ఇప్పుడు ముంపు మండలాలపై వివాదం చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుతామని తెలంగాణ బిల్లు రూపకల్పనకు ముందే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ముంపు గ్రామాలపై అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు స్పందించలేదన్నారు.

ఆ చరిత్ర మాకు లేదు: కాల్వ

ఫిరాయింపుల్ని ప్రోత్సహించే చరిత్ర టిడిపికి లేదని ఆ పార్టీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వేరుగా అన్నారు. ఎమ్మెల్సీల ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నామన్న ఎపిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యలను కాల్వ ఖండించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెసు పార్టీలో ఇమడలేకే టిడిపిలోకి వస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+