ఏపీలో త్రిపుర మోడల్‌ అమలు చేస్తున్న బీజేపీ- ఆలయాల్లో ఘటనల కారణమిదే- పేర్ని వ్యాఖ్యలు

ఏపీ దేవాలయాల్లో అవాంఛనీయ ఘటనలు పెరిగిపోతున్నాయి. అంతర్వేది ఘటనలో రధం దగ్దం కావడానికి ముందు పలు దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ప్రభుత్వం వాటిని సీరియస్‌గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో తాజాగా అంతర్వేది ఘటన తర్వాత సీబీఐ దర్యాప్తు వరకూ వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఘటనల వెనుక కారణం బీజేపీయే అని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది.

ఏపీ దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల వెనుక బీజేపీయే ఉందని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. గతంలో త్రిపురలోనూ కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలే జరిగాయని, ఆ తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని రవాణామంత్రి పేర్నినాని గుర్తుచేశారు. అప్పట్లో అక్కడ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సునీల్‌ దియోధర్ ఇప్పుడు ఏపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని ఆయన తెలిపారు. దీంతో త్రిపుర మోడల్‌ను బీజేపీ ఏపీలోనూ అమలు చేస్తోందనే భావన కలుగుతోందన్నారు.

ap minister perni nani accused bjp for implementing tripura model in temple incidents

గతంలో త్రిపురలో బీజేపీ హిందూ ఓట్లను సమీకరించడం ద్వారా అధికారంలోకి వచ్చిందని, కానీ దోషులను మాత్రం ఇప్పటివరకూ పట్టుకోలేకపోయిందని మంత్రి పేర్నినాని గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతున్నట్లు ఉందన్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి అంటూ పేర్నినాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+