కీలక అనుచరుడి దారుణ హత్య: మంత్రి పేర్ని నాని కన్నీటిపర్యంతం

కృష్ణా: మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తన అనుచరుడు మోకా భాస్కర్ రావు మృతదేహానికి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. భాస్కర్ రావు మృతదేహాన్ని చూసిన మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి గురయ్యారు. నివాళులర్పిస్తున్న సమయంలో మంత్రి కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం భాస్కర్ రావు కుటుంబాన్ని మంత్రి ఓదార్చారు.

ఈ సందర్భంగా రాజకీయ హత్య అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే కిరాయి మనుషులతో చంపించారని వ్యాఖ్యానించారు. హత్యకు మూడురోజులపాటు రెక్కి నిర్వహించారని భావిస్తున్నామన్నారు. ఘటనపై తనతో, ఎస్పీతో సీఎం జగన్ ఫోన్లో మాట్లాడారని మంత్రి చెప్పారు.

AP minister perni nani pay tributes to ysrcp leader moka bhaskar rao.

కాగా, మున్సిపల్ చేపల మార్కెట్లో ఉన్న భాస్కర్ రావును దుండగులు కత్తితో
పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

దుండగులు పక్కా ప్లాన్‌తో సైనేడ్ పూసిన కత్తితో భాస్కర్ రావును హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు చెబుతున్నారు. కాగా, భాస్కర్ రావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆస్పత్రి వద్ద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకున్నాయి.

మరోవైపు భాస్కర్ రావు హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+