గుర్రంపై మంత్రి రైడ్ .. ఎక్కడో తెలుసా ?
అమరావతి : పుర్రెకో బుద్ది .. జిహ్వాకో రుచి ... పెద్దలు సామెతలు ఊరికే చెప్పలేదు. సమాజంలో వివిధ రకాల వ్యక్తుల ఆలోచనలు బట్టే హితోపదేశం చేశారు. సామెత ఓకే .. కానీ మనలో చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి. స్విమ్మింగ్, రైడింగ్ .. ఉంటాయి. వీటిలో దాదాపు కోరికలు తీరిపోతాయి. గుర్రపు స్వారీ అంటే పడిచచ్చేవారు ఉంటారు. పాత సినిమాల్లో కౌబాయ్ వేషంలో వచ్చే హీరో లగ్జరీ కారు కాదు .. గుర్రం మీదే రాజసం ఒలకబోస్తు వస్తాడు. మనమంతా కళ్లప్పగించి చూస్తాం.
రియల్ హీరో ..
సినిమాల్లో ఓకే .. మరీ నిజ జీవితంలో చాలా అరుదు. ఎగ్జిబిషన్, గల్లీలోకి వచ్చిన సమయంలో గుర్రపు స్వారీ వీలవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు రైడింగ్ అంటే ఇష్టం కావొచ్చు. అందుకే ఏం చక్కా గుర్రం ఎక్కి విహరించారు. ఒక్కటి కాదు రెండు గుర్రాలపై రైడ్ చేశాడు. దానికి సంబంధించిన ఓ వీడియో మీడియాకు చిక్కింది. ఓ మంత్రి గుర్రపు స్వారీ చేయడం ఆరుదు .. కాబట్టి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోలవుతుంది.

ఇదీ నేపథ్యం ...
అనిల్ కుమార్ యాదవ్ .. నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. సామాజిక సమీకరణాలు, వైసీపీ అధినేత జగన్‌తో సాన్నిహిత్యంతో అతనికి కీలకశాఖ వరించింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత కార్పొరేటర్‌గా గెలిచి ప్రజలతో మమేకమయ్యారు. అనిల్ కెరీర్ ప్రారంభమైంది మాత్రం వైద్యుడిగా .. తర్వాత ప్రజాసేవ చేయాలనే తలంపుతో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అయితే అనిల్‌కు గుర్రపు స్వారీ అంటే ఇష్టమని అతని సన్నిహితులు చెప్తున్నారు. ఇదివరకు రెండు గుర్రాలపై స్వారీ చేసిన వీడియో చూస్తే మనకు కూడా అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications