జగన్ కు షాకిచ్చిన రోజా భర్త సెల్వమణి -మంత్రి గారు గప్ చుప్-వైజాగ్ బ్రాండ్ ప్లాన్ కు దెబ్బ ?

ఎప్పుడూ ప్రత్యర్ధులపై తన పదునైన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఏపీ మంత్రి ఆర్కే రోజా మంత్రి అయ్యాక కూడా తన జోరు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఆమె భర్త తాజాగా చేసిన ఓ డిమాండ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలాఉంది. దీనిపై మాత్రం రోజా నోరు మెదపకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీంతో రోజాతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా ప్రత్యర్ధులకు టార్గెట్ అవుతోంది.

 రోజా భర్త సెల్వమణి డిమాండ్

రోజా భర్త సెల్వమణి డిమాండ్

ఈ మధ్య తమిళ సినిమా హీరోలు తమ షూటింగ్స్ ను వైజాగ్ తో పాటు హైదరాబాద్ లో జరిపేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. తమ షూటింగ్స్ కు అనుకూలంగా ఉండే కొత్త లొకేషన్స్ కోసం వెతుకుతున్న వారు వైజాగ్ లో షూటింగ్స్ చేస్తున్నారు. దీంతో రాయలసీమతో పాటు చిత్తూరు సరిహద్దుల్లో ఉండే పలు ప్రాంతాల్లో షూటింగ్స్ హవా గతంతో పోలిస్తే తగ్గింది. దీనిపై ఘాటుగా స్పందించిన తమిళ దర్శకుడు, అఖిల భారత సినీ కార్మికుల సమాఖ్య నేత కూడా అయిన ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి తమిళ హీరోలకు చురకలు అంటించారు. వైజాగ్ లో షూటింగ్ లు తగ్గించుకోవాలని హితవు పలికారు. ఇది కాస్తా ఏపీ ప్రభుత్వానికి తాకింది.

జగన్ సర్కార్ కు షాక్

జగన్ సర్కార్ కు షాక్

వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధానిగా ప్రమోట్ చేస్తూ టాలీవుడ్ షూటింగ్స్ కు కూడా సహకరిస్తామని హామీలు ఇస్తున్న జగన్ సర్కార్ కు ఇప్పుడు సెల్వమణి అభ్యంతరాలు షాకిచ్చాయి. ముఖ్యంగా ఏపీ మెంత్రి రోజా భర్త కూడా అయిన సెల్వమణి తమ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా వైజాగ్ లో షూటింగ్స్ వద్దంటూ వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ కూడా ఇరుకునపడింది. దీంతో ఇప్పుడు సెల్వమణి డిమాండ్ ప్రభావం ఏపీ ప్రభుత్వంపై పడుతోంది. అయితే వైసీపీతో పాటు సీఎం జగన్, మంత్రి రోజా కూడా దీనిపై మౌనం వహిస్తున్నారు.

 భర్త డిమాండ్ పై రోజా మౌనం

భర్త డిమాండ్ పై రోజా మౌనం

తమ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ప్రమోట్ చేస్తున్న వైజాగ్ లో టూరిజం మంత్రిగా పర్యాటకం అభివృద్ఘిికి కృషి చేయాల్సిన ఆర్కే రోజా ఇప్పుడు తన భర్త తమిళ హీరోల షూటింగ్స్ వద్దంటూ చేసిన డిమాండ్ పై ఇరుకునపడ్డారు. సెల్వమణి వ్యాఖ్యలపై రోజా ఇప్పటివరకూ స్పందించలేదు. పర్యాటక మంత్రిగా ఉన్న రోజా తన భర్త చేసిన డిమాండ్ పై ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే దీనిపై స్పందించకుండా మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

వైజాగ్ బ్రాండ్ కు దెబ్బ ?

వైజాగ్ బ్రాండ్ కు దెబ్బ ?


ఓవైపు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ వేల కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం అందుకు తగ్గ మైలేజ్ తెచ్చుకోలేకపోతోంది. అమరావతిపై హైకోర్టు తీర్పుతో మూడు రాజధానులపై దూకుడుగా వెళ్లలేని పరిస్ధితి ఉంది. అదే సమయంలో వైజాగ్ లో షూటింగ్స్ వద్దంటూ రోజా భర్త సెల్వమణి తమిళ హీరోలకు చేసిన సూచన ఇప్పుడు అంతిమంగావైసీపీకి ఎదురుదెబ్బగా మారబోతోంది. అదే సమయంలో ఓవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దెబ్బతీసేలా పర్యాటక మంత్రి రోజా కుటుంబసభ్యుడు చేసిన వ్యాఖ్య వైజాగ్ బ్రాండ్ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+